బాబాయ్ ఆర్డర్ వేస్తె ప్రచారాలకు వెళతా: రామ్ చరణ్

Friday, May 25th, 2018, 02:15:21 AM IST

మెగా ఫ్యామిలీలో హీరోలు ఎంత క్లోజ్ గా ఉన్నప్పటికీ ఎదో ఒక రూమర్ వారి మధ్య విభేదాలు ఉన్నాయంటూ వైరల్ అవ్వడం కామన్. ఎన్ని రూమర్స్ వచ్చినా మెగా హీరోలు వాటిని పట్టించుకోరు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన పోరాట పటిమను నలుదిక్కుల తెలిసేలాగా పని చేస్తున్నాడు. తనదైన రాజకీయ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ యాత్రలతో ముందుకు సాగుతున్నాడు. ఎవరి సహాయం లేకుండా ఒక్కడే సామాన్యుడిలా కష్టపడుతున్న విధానానికి చాలా మంది నుంచి పవన్ కు మద్దతు లభిస్తోంది.

ఇక పవన్ బాబాయ్ కు ఎప్పుడు తన మద్దతు ఉంటుందని ఇటీవల రామ్ చరణ్ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా బ్యాంకాక్ నుంచి తిరిగివచ్చిన రామ్ చరణ్ ఓ మీడియాతో మాట్లాడుతూ.. పర్యటనలో బాబాయ్ కష్టపడుతున్న విధానానికి బాధగా ఉందని కానీ ప్రజల బాధను చూసి ఆయన వెళ్లారు గనక మనం ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. ఇక పవన్ ప్రచారాలకు ఆహ్వానిస్తే వెళతారా అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ఆయన ఆర్డర్ వేస్తె తప్పకుండా వెళతాను అని తెలిపాడు. అయితే ఇంతవరకు బాబాయ్ నుంచి అలాంటి రాజకీయ ప్రస్తావన రాలేదన్నట్లు చరణ్ సమాధానం ఇచ్చారు.

  •  
  •  
  •  
  •  

Comments