10కె రన్ లో క్రేజీగా కేటీఆర్ తో ధృవ..!

Sunday, November 27th, 2016, 09:57:38 AM IST

ktr-ramchran
ఆదివారం ఉదయం హైదరాబాద్ నగరం లో 10 కె రన్ అట్టహాసంగా జరిగింది.నగర ప్రజలు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పాల్గొని ఆకాదున వర్ణిని ఉత్సాహపరిచారు. ఆటపాటలతో ఈ కార్యక్రమం ఉర్రూతలూగేలా సాగింది. తెలంగాణకు సంబంధించిన ప్రతి కార్యక్రమం లో ఉత్సాహంగా పాల్గొనే కేటీఆర్ ఈ కార్యక్రమం లోకూడా పాల్గొన్నారు.

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, రామ్ చరణ్, రాశి ఖన్నా, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ తో కలసి కేటీఆర్ సెల్ఫీ సెల్ఫీ దిగారు. 10 కె రన్ అనంతరం హీరో రామ్ చరణ్.. మంత్రి కేటీఆర్, సానియా మీర్జా, రాశి ఖన్నాలని స్వయంగా తన కారులో తీసుకుని వెళ్లారు. కేటీఆర్ తో దిగిన సెల్ఫీని సానియా సోషల్ మీడియా లో పంచుకుంది.