కుస్తీలు ఆపండి..మహేష్, చరణ్ లలా దోస్తీ కట్టండి..!!

Thursday, December 29th, 2016, 06:48:09 PM IST

mahesh
సినీ పరిశ్రమలో హీరోల మధ్య పోటీ ఉండదు. కానీ అభిమానుల మధ్య వార్ లే జరుగుతుంటాయి.మా హీరోనే గొప్ప.. మా హీరో చిత్రాలే ఎక్కువ వసూళ్లు సాధించాయి.. వంటి వాదనలు జరుగుతూ అవి తీరా పెద్ద గొడవలు జరిగే పరిస్థితి కి దారితీస్తాయి. ఇలాంటి ఘటనలు టాలీవుడ్ లో ఎక్కువగా జరుగుతూంటాయి.అభిమానులు ఇలాంటి ఘటనలను ఆపాలని హీరోలు ఎంత ప్రయత్నించినా అవి ఆగడం లేదు. టాలీవుడ్ లో కొందరు స్టార్ హీరోలు మధ్య మంచి స్నేహం ఉంది. వారి దోస్తీ చూసైనా అభిమానులు కుస్తీ పడడం ఆపాలని సినీవిశ్లేషకుల సూచిస్తున్నారు. గతంలో చిరంజీవి.. మహేష్ ని అభినందించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మహేష్ నటించిన ‘అతడు’ చిత్రం విడుదలై ప్రదర్శింపబడుతున్న రోజుల్లో ఆ చిత్రం తనకెంతో నచ్చిందని చిరంజీవి మహేష్ ని అభినందించాడు. మహేష్ కూడా ఓ సందర్భంలో టాలీవుడ్ లో నెంబర్ వన్ చిరంజీవే అని అర్థం వచ్చేలా అతడి డాన్సులు, నటన గురించి పొగిడాడు. మహేష్, చిరంజీవి ల కుటుంబాల మధ్య ఆ సాన్నిహిత్యం అప్పుడే కాదు ఇప్పటికీ కొనసాగుతోంది.

రాంచరణ్ రెండవ చిత్రం ‘ఆరెంజ్’ లో మహేష్ అక్కా బావాలు ముఖ్యమైన పాత్రలలో నటించిన విషయం తెలిసిందే. రాంచరణ్ కూడా మహేష్ అంటే తనకెంతో ఇష్టమని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. మహేష్ నటించిన ‘శ్రీమంతుడు’ చిత్రం ఘన విజయం సాధించడంతో రాంచరణ్ ఫోన్ చేసి మరీ అభినందించిన విషయాన్ని మహేష్ తెలిపాడు. కాగా తాజాగా మరోమారు రాంచరణ్, మహేష్ ల మధ్య సాన్నిహిత్యం బయటపడింది.మహేష్ ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వం లో ఓ చిత్రం లో నటిస్తున్నాడు. రామ్ చరణ్ నటించిన ధృవ చిత్రం విడుదలై విజయవంతం గా ప్రదర్శింపబడుతోంది. మహేష్ తన షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో గడపడానికి ఫారెన్ కు వెళ్లాడు. క్రిస్మస్ హాలిడే లోఉన్న మహేష్ కుటుంబాన్ని రాంచరణ్ కలిసాడు. ఈ సందర్భంగా చరణ్ మహేష్ తో కలసి ఫోటో దిగాడు. ఈ ఫోటో లో మహేష్ చరణ్ లతో పాటు గౌతమ్, ఎంపీ గలా జయదేవ్ లు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.గతంలో పవన్ కళ్యాణ్ ‘జల్సా ‘చిత్రానికి మహేష్ వాయిస్ ఓవర్ అందించిన విషయం కూడా తెలిసిందే. వీరిద్దరూ కలసి పైరసీ మీద కూడా పోరాటం చేశారు. ఇలా అగ్రహీరోలు ఎలాంటి ఇగోలు లేకుండా సాన్నిహిత్యంగా మెలుగుతుంటే అభిమానుల మధ్య గొడవలు అనవసరమని సినీవిశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ అభిమానుల మధ్య గొడవలనేవి దక్షణాది చిత్ర పరిశ్రమలలోని ఎక్కువగా కనిపిస్తుంటాయి. బాలీవుడ్ లో అయితే అగ్రహీరోలే ఒకరిపై ఒకరు జోక్ లు వేసుకునేంత సాన్నిహిత్యంగా ఉంటారు. బాలీవుడ్ లో అగ్రహీరోలు భారీ స్థాయిలో అభిమానులు ఉన్నా ఇక్కడ ఉన్నట్లు ఫ్యాన్ వార్స్ ఉండవని అంటున్నారు. అలాంటి వాతావరణం ఇక్కడ కూడా రావాలని సినీవిశ్లేషకులు కోరుకుంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments