అధినందన్ లుక్ తో అదరగొడుతున్న చెర్రీ.!

Thursday, March 14th, 2019, 07:23:48 PM IST

బాహుబలి రెండు పార్టుల తర్వాత మళ్ళీ ఆ రేంజ్ హైప్ తీసుకొస్తున్న తెలుగు సినిమా ఏదన్నా ఉంది అంటే ఇప్పుడు అది RRR సినిమాయే అని చెప్పాలి.అదే రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం ఈ రోజు నిర్వహించిన ప్రెస్ మీట్ లో చాలా విషయాలనే వెల్లడించారు.దీనితో పాటు ఈ సినిమాలో మోస్ట్ పవర్ ఫుల్ పాత్రల్లో నటిస్తున్నటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల లుక్ ఏ విధంగా ఉండబోతుందో అన్నదానికి కూడా చిన్న క్లారిటీ ఇచ్చేసారు.అయితే ఈ ప్రెస్ మీట్ లో రామ్ చరణ్ లుక్ మాత్రం కాస్త ప్రత్యేకంగానే కనిపించిందనే చెప్పాలి.

ఎందుకంటే రామ్ చరణ్ ను ఈ లుక్ లో చూసినట్లయితే పాక్ సైన్యానికి చిక్కినా సరే ఏ మాత్రం బెఱుకు లేకుండా దేశ సైన్య రహస్యాలను ఏ మాత్రం బయట పెట్టకుండా చూపిన ధైర్యంకు భారతదేశ జనాభా అంతా ఫిదా అయ్యిపోయారు.దానితో అభినందన్ మీసపు కట్టు లుక్ బాగా ఫేమస్ అయ్యింది.అయితే ఈ రోజు రామ్ చరణ్ ను ఈ రోజు ప్రెస్ మీట్ లో చూసిన వారికి మాత్రం అభినందన్ ఖచ్చితంగా గుర్తు రాక మానరు.దీనితో అభిమానులు కూడా ఈ లుక్ లో రామ్ చరణ్ ను చూసి మరింత ఆనంద పడుతున్నారు.