అమృత ప్రణయ్ లకు జరిగిన అన్యాయంపై స్పందించిన రామ్ చరణ్..!

Tuesday, September 18th, 2018, 05:44:35 PM IST

కులాంతర వివాహం చేసుకున్న నేపథ్యంలో తన అల్లుడిని చంపించిన మారితిరావు పట్ల రాష్ట్రంలో ప్రతి ఒక్కరు తీవ్ర ఆగ్రహానికి లోనవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరు వారి యొక్క సంతాపాన్ని తెలియజేస్తున్నారు.వారిలో కొంత మంది సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. మొన్ననే హీరో రామ్ కూడా తన ట్విట్టర్ ద్వారా ఈ విషయంపై చాలా ఘాటుగానే స్పందించారు.

ఇప్పుడు ఇదే విషయంపై హీరో రామ్ చరణ్ తన అభిప్రాయాన్ని తన పేస్ బుక్ ద్వారా ప్రేక్షకులకు పంచుకున్నారు. తాను ఈ విషాద సంఘటనపై మాట్లాడుతూ “గౌరవాన్ని కాపాడుకోవడం కోసం చంపడం ఏంటి? అని ఒక నిండు ప్రాణాన్ని బలికొనడం లో మీ గౌరవం ఎక్కడుంది..?ఈ సమాజంలో మనం ఎటువైపు వెళ్తున్నాం?” అని ప్రశ్నించారు.బాధితురాలు అమృతకు మరియు మృతుడు ప్రణయ్ ఇద్దరి కుటుంబాలకు తన సంతాపాన్ని తెలిపారు.అలాగే ప్రణయ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు రామ్ చరణ్.చివరిలో కొసమెరుపుగా “ప్రేమకు ఎలాంటి హద్దులు ఉండవు” అని “ప్రణయ్ కు న్యాయం చేకూరాలని” హ్యస్ టాగ్లు పెట్టారు..