బాబాయ్ నువ్వు చెప్తే చెయ్యకుండా ఉంటానా చేసి చూపిస్తా..రామ్ చరణ్!

Sunday, October 21st, 2018, 03:59:53 PM IST

శ్రీకాకుళం టిట్లి తుఫాను భాదితులకు అండగా నేను ఉంటానని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజుల నుంచి అక్కడ భారీగా నష్టపోయిన ప్రాంతాల్లోనే తమ పార్టీ ముఖ్య నేతలతో కలిసి అక్కడ పర్యటిస్తున్నారు.అదే సమయంలో కొన్ని బయటికి రాని నిజాలు కూడా పవన్ వల్ల బాహ్య ప్రపంచానికి తెలిసాయి.అయితే అక్కడి ప్రజలకు తాను మాత్రమే అండగా ఉండటమే కాకుండా సినీ రంగంలో ఉండే తన స్నేహితులను ఇక్కడి బాధితులకు సాయం అందించేలా కోరుతానని తెలిపారు.అదే సందర్భంలో పవన్ తన తమ్ముడు అని పిలుచుకునే రామ్ చరణ్ తో కూడా మాట్లాడి ఇక్కడ ఏదొక గ్రామాన్ని దత్తత తీసుకోమని అడుగుతానని తెలిపారు.

అయితే ఈ విషయంపై నిన్నటి నుంచి మెగా ఫ్యాన్స్ లో ఒక ఆసక్తికర వాతావరణం నెలకొంది.పవన్ చెప్పిన మాటలను చరణ్ తప్పకుండా వింటాడని అభిమానులు అభిప్రాయపడ్డారు.ఈ విషయంపై ఇప్పుడు తాజాగా చరణ్ “బాబాయ్ నన్ను అక్కడ దెబ్బ తిన్న గ్రామాలలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకోమని సూచించడం చాలా ఆనందానికి గురి చేసిందని,కళ్యాణ్ బాబాయ్ యొక్క సూచనల మేరకు తాను తన టీం తో చర్చించి అక్కడ దెబ్బ తిన్న గ్రామాలను పరిశీలించి అతి త్వరలోనే దత్తత తీసుకుంటానని” ఒక ప్రెస్ మీట్ నోట్ ని విడుదల చేశారు.ఈ విషయం తెలుసుకున్న మెగాభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.మరో సారి అబ్బాయ్ తన బాబాయ్ మీదున్న ప్రేమను వ్యక్త పరిచాడు.

  •  
  •  
  •  
  •  

Comments