వీవీఆర్ ఎఫెక్ట్: ఇదెక్కడి ట్విస్ట్ చరణ్..!

Tuesday, February 12th, 2019, 11:20:23 AM IST

రామ్ చరణ్, బోయపాటిల కాంబినేషన్లో ఈ సంక్రాంతి సందర్బంగా వచ్చిన “వినయ విధేయ రామ” ఎంత డిజాస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలూ మిగల్చటంతో డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో ముగ్గురు కలిసి నష్టాలను పంచుకుందామని చరణ్ అనుకున్నప్పటికీ బోయపాటి నిరాకరించటంతో వివాదం నెలకొంది, చివరకు చిరంజీవి, అల్లు అర్జున్ కలుగచేసుకోవటంతో వివాదం సద్దుమణిగింది. ఇదిలా ఉంటే , వీవీఆర్ డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు రికవరీ చేసే విషయంలో రామ్ చరణ్ ఓ చిన్న ట్విస్ట్ పెట్టినట్టు ఫిల్మ్ నగర్ టాక్. క్యాష్ రూపంలో 5కోట్లు ఇవ్వకపోగా,చరణ్ తర్వాతి సినిమా నుండి రికవరీ చేసుకోవాలని చెప్పారట పోనిలే “ఆర్ ఆర్ ఆర్” సినిమా రికవరీ చేసుకుందాం అనుకున్న డిస్ట్రిబ్యూటర్లకు మరో ట్విస్ట్ పెట్టినట్టు తెలుస్తుంది.

అదేంటంటే చిరు, త్రివిక్రమ్ ల సినిమా నీవుంది ఆ నష్టాలను రికవరీ చేసుకోమని చెప్పాడట, దీంతో డిస్ట్రిబ్యూటర్లు షాక్ కు గురయ్యారట. ప్రస్తుతం చిరంజీవి సైరలో బిజీగా ఉండగా,ఆ సినిమా పూర్తైన వెంటనే కొరటాలతో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. కొరటాల సినిమా పూర్తైన తర్వాత త్రివిక్రమ్ తో సినిమా ఉండనుంది, మరో పక్క త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో సినిమాకు రెడీ అవుతున్నాడు అది పూర్తయ్యాక వెంకీతో ఇంకో సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు, ఆ రెండు సినిమాలు పూర్తయ్యాకే చిరు, త్రివిక్రమ్ ల సినిమా ఉండనుంది. మరి, డిస్ట్రిబ్యూటర్లు అంత కాలం వెయిట్ చేస్తారా?, చరణ్ ప్రపోసల్ కు ఎలా స్పందిస్తారో చూడాలి.