పవన్ పై వర్మ సెటైర్లు..ఫ్యాన్స్ కౌంటర్లు!

Sunday, May 13th, 2018, 12:48:20 PM IST

ఇటివల రవితేజ నేల టిక్కెట్టు ఆడియో వేడుకకు ముఖ్య అతిధిగా పవన్ కళ్యాణ్ వెళ్లిన సంగతి అందరికి తెలిసిందే. అయితే పవన్ రాకతో సినిమాకు ఫుల్ గా ప్రమోషన్స్ వచ్చింది. ఇకపోతే వర్మ ఆడియో ఫంక్షన్ లోని ఒక వీడియో ని ఆధారంగా చేసుకొని పవన్ పై గ్యాప్ లేకుండా సెటైర్లు వేయడం మొదలుపెట్టారు. రవి తేజ పక్కన కూర్చున్న పవన్ రవితేజ టోన్ జీన్స్ ను తదేకంగా చూస్తు ఎదో మాట్లాడుతున్నట్లు ఉన్న వీడియో ని పోస్ట్ చేస్తూ.. “అజ్ఞాతవాసి పవన్ కల్యాణ్ లో ఈ యాంగిల్ కూడా ఉందని హావభావాలను బట్టి మొహంలో ‘టచ్ చేసి చూడు’ టైప్ లో తెలుస్తోంది. ఈ రహస్యం మెగా ఫ్యామిలీకి, జనసేన పార్టీకి కూడా తెలిసుండదు. అయితే, పీకే గిల్లుళ్లలో నేల టికెట్ల కనెక్షన్లు కనిపిస్తున్నాయి” అని ట్వీట్ చేశారు.

ఇక మరో ట్వీట్స్ లలో “రవితేజ తొడమీద ఉన్న తన అత్యంత శ్రద్ధలోని జస్ట్ సగం రెండు రాష్ట్రాల మీద పెడితే, అబ్బో… అత్యంత సస్యశ్యామలమే” – “తొడకి, పవన్ కల్యాణ్ కుడి చేతికి ఉన్న అవినాభావ సంబంధం ఆ దేవుడికే తెలియాలి” – “రవితేజ, పవన్ కల్యాణ్ మధ్యలో ఉన్న ఈ తొడ సంబంధం గురించిన లోగుట్టు పెరుమాళ్లకే తెలియాలి. కానీ పీకేకి, రవి ఎడమతొడ మీద చాలా మక్కువ ఉందన్న విషయం పీకే మొహంలో ఉన్న ఆనందంలో కనబడుతోంది” అంటూ వ్యంగ్యాస్త్రాలు చేశారు. ఇక మరికొందరు వర్మపై కౌంటర్లు వేయడం కూడా స్టార్ట్ చేయడంతో ఆ ట్వీట్స్ కాస్త మరింత వైరల్ అయ్యాయ.