తప్పు చేసినట్లు రుజువైతే వర్మకు 7 ఏళ్ల జైలు శిక్ష

Sunday, February 18th, 2018, 03:52:15 AM IST

టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై పోలీస్ కేసు నమోదు అయిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ రోజు హైదరబాద్ సీసీఎస్ పోలీసులు వర్మను దాదాపు 3 గంటల వరకు విచారణ జరిపారు. ఈ విచారణలో వర్మ న్యాయపరంగా కొన్ని ప్రశ్నలను ఎదుర్కొన్నారు. దాదాపు ఆ మూడు గంటల సమయంలో వర్మ 20 కు పైగా ప్రశ్నలను ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా వర్మకు సంబందించిన పర్సనల్ మొబైల్ ల్యాప్ టాప్ లను పోలీసులు సీజ్ చేశారు. ఆయనకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయనే విషయాలను పోలీసులు తెలుసుకోవాలని అనుకుంటున్నారు. అందుకే మొబైల్ ల్యాప్ టాప్ ని స్వాధీనం చేసుకున్నట్లు టాక్.

ఇక ఈ కేసుపై సైబర్ క్రైమ్ డీసీపీ రఘువీర్ మాట్లాడుతూ.. వర్మ విచారణకు సహకరించాడు. అయితే అతను అశ్లిల సినిమా తీయలేదని చెబుతున్నాడు. కేవలం కాన్సెప్ట్ తనదని వేరేవాళ్లు డైరెక్ట్ చేశారట. అయితే ఏ విధంగా వర్మ తప్పు చేసినట్లు తెలిసిన చట్టపరంగా శిక్షించడం జరుగుతుంది. ఒక భారతీయుడు విదేశాల్లో తప్పు చేసినా ఇక్కడ తప్పు చేసినా చట్టం నుంచి తప్పించుకోలేరు. ఇది ఒక్క రోజులో తేలే విషయం కాదు. టెక్నీకల్ విషయానికి సంబంధించింది కావున అన్ని వైపులా ఆధారాలను సేకరించిన తరువత చర్యలు తీసుకుంటాం. ఒకవేళ వర్మ తప్పు చేసినట్టు రుజువైతే రెండేళ్ల నుంచి లేదా ఏడేళ్ల మధ్యలో జైలు శిక్ష పడే అవకాశం ఉందని వారు తెలియజేశారు. సామాజికవేత్త దేవి గారు గత నెల 25న సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు వర్మపై పిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అవమానించే విధంగా మాట్లాడారని ఐపీసీ 506, ఐటీ యాక్ట్‌ కింద కేసులు నమోదు కావడంతో పోలీసులు వర్మను విచారణ చేశారు. అంతే కాకుండా సోమవారం కూడా విచారణ హాజరుకావాల్సి ఉంటుందని పోలీసులు మరో నోటీసును అందించారు.