తొందరపడి చంపేసిన వర్మ..!

Wednesday, December 17th, 2014, 12:46:27 PM IST

ramgopal-varma
ప్రముఖ దర్శకుడు కె బాలచందర్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాదపడుతూ చెన్నైలోని కావేరీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నప్పటికీ… చికిత్సచేసేందుకు ఆయన సహకరిస్తున్నట్టు డాక్టర్స్ దృవీకరించిన విషయం విదితమే.

ఇక వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడు వార్తలలో ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా బాలచందర్ పై కూడా ట్వీట్ చేసి చిక్కుకున్నాడు. తరువాత తను చేసిన తప్పుడు తెలుసుకొని వెంటనే సరిదిద్దుకున్నారు. బతికున్న వాళ్ళను మరణించినట్టు ట్వీట్ చేయడంతో నెటిజన్లు మండిపడుతున్నారు.