పుండు మీద కారం జల్లుతున్న రామ్ గోపాల్ వర్మ.!

Sunday, May 26th, 2019, 06:58:37 PM IST


ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ అంతటిలోను జగన్ ముఖ్యమంత్రి అయినందుకు ఒక్క రామ్ గోపాల్ వర్మ పడుతున్న ఆనందం మరెవ్వరు పడి ఉండరని చెప్పాలి.ఇక జగన్ ఎలాగో ముఖ్యమంత్రి అవుతున్నారని సంకేతాలు రావడంతోనే వర్మ తెలుగుదేశం పార్టీపై తన ట్వీట్లతో దాడి చెయ్యడం మొదలు పెట్టారు.తాను తీసిన “లక్ష్మిస్ ఎన్టీఆర్” సినిమాలో పాటలలోని విజువల్స్ లో బాబు పాత్రను చూపించి అనేక రకాల ట్వీట్లు పెట్టి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.అలాగే తనని బాబు ప్రభుత్వం వారు ఆపిన చోటే మళ్ళీ ప్రెస్ మీట్ పెడతానని ఛాలెంజ్ లు కూడా విసురుతున్నారు.

ఇదొక్కటే కాకుండా దివంగత ఎన్టీఆర్ కార్టూన్ ఫోటో పెట్టి జగన్ కు శుభాకాంక్షలు తెలుపు తాజాగా తన తర్వాతి సినిమా “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” అనే టైటిల్ పెట్టానని అనేక రకాల ట్వీట్లు పెట్టి ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు.ఒకటి రెండు సార్లు అంటే ఓకే ఇప్పటికే ఏపీ లో వారు అనుకున్న స్థాయి విజయం సాధించలేదని పడుతున్న బాధకు తోడుగా ఇలా ప్రతీ దానికి గుచ్చి గుచ్చి పుండు మీద కారం జల్లుతుండడం మరీ అతి అనిపిస్తుంది.మరి వర్మ ఇది ఇక ముందు అయినా ఆపుతారో లేదా అలా టీడీపీని ఇబ్బంది పెడతారో చూడాలి.