ప్రణయ్ హత్య విషయంపై రాంగోపాల్ వర్మ స్పందన ఎలా ఉంది.?

Friday, September 21st, 2018, 07:07:10 PM IST

తన కూతురు కులాంతర వివాహం చేసుకుందన్న కారణంతో మారుతిరావు అనే ఒక కుల రాక్షసుడు తన అల్లుడిని అత్యంత ఘోరంగా హత్య చేయించిన సంగతి తెలిసినదే,ఐతే ఈ విషయం పట్ల ప్రతీ ఒక్కరు అమృతకు మరియు ప్రణయ్ కుటుంబానికి మద్దతుగా ఉన్నారు,ప్రణయ్ హత్యకి కారణమైన ప్రతి ఒక్కరిని ఉరి తియ్యాలని డిమాండ్ చేస్తున్నారు.ఇప్పుడు ఆ నిందితులు అందరూ పోలీసు శాఖ వారి అదుపులో ఉన్నారు,ఇప్పుడు ఈ సంచలన కేసు పట్ల ఎప్పుడు వివాదాలతో కొట్లాడే మరో సంచలన దర్శకుడు తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచాడు.

అతనే మిస్టర్ కాంట్రావెర్సీ రాంగోపాల్ వర్మ. ఈ సారి కూడా తనదైన శైలి లోనే తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.మారుతీ రావుని ఉద్దేశిస్తూ “నువ్వు ఒక క్రూరమైన పిరికిపందలా ప్రణయ్ ని హత్య చేయించి పరువుహత్య అని అన్నావు,ఇప్పుడు నువ్వు నిజమైన పరువు హత్య అంటే ఏంటో చూస్తావు అంటూ నిజమైన పరువు హత్య ఏంటంటే పరువు కోసం హత్యలు చేయించే వారిని హత్య చెయ్యడమే అసలైన పరువు హత్య” అంటూ తన స్టైల్ లోనే అంటూ ముగించారు.