లక్ష్మీస్ ఎన్టీఆర్..ఇది “కుటుంబ కుట్రల చిత్రం”.!

Saturday, February 9th, 2019, 11:00:56 PM IST

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్” సినిమా తెరకెక్కిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.దివంగత ఎన్టీఆర్ గారి జీవిత చరిత్రపై తాను అసలైన నిజాలను చూపిస్తానని వర్మ ఛాలెంజ్ కూడా చేసారు.ఇప్పటికే అసలైన నిజాలు ఏమిటా అని చాలా మందే ఎదురుచూస్తున్నారు.ఈ సమయంలో వర్మ మరో బాంబు వేసారు.ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ ను ఈ నెల 14 న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆ రోజు ఉదయం 9:27 నిమిషాలకు విడుదల చేస్తాను అని స్పష్టం చేసారు.

దీనికి ఆయన ఒక ఆసక్తికర ట్యాగ్ కూడా పెట్టుకున్నారు.మాములుగా అన్ని సినిమాలకు మాది కుటుంబ కథా చిత్రం అని చెప్పుకుంటారు కానీ ఇక్కడ వర్మ మాత్రం అందుకు భిన్నంగా ఇది “కుటుంబ కుట్రల చిత్రం” అని అంటున్నారు.ఈ ట్రైలర్ ద్వారా ఎన్టీఆర్ గారిని అప్పుడు ఎవరు ఎలా కుట్రపూరితంగా మోసం చేసారు,విధేయత లేని అభిమానులు,కుటుంబీకులు ఎలా అన్నగారి పతనానికి కారణమయ్యారో తెలియాలంటే ఈ ట్రైలర్ కోసం ఎదురు చూడాలని వర్మ ఒక సంచలన ట్వీట్ పెట్టారు.