వర్మ “మహానాయకుడు” సినిమానికి ఇలా షాకిచ్చాడేంటి..?

Tuesday, February 12th, 2019, 07:00:44 PM IST

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి జీవితచరిత్రపై అసలైన నిజాలు చూపిస్తానంటూ “లక్ష్మీస్ ఎన్టీఆర్” అనే ఒక సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసినదే.అయితే తాను మొదటి నుంచి ఈ సినిమాతో చంద్రబాబును అలాగే క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న “యన్.టి.ఆర్” సినిమాను టార్గెట్ చేస్తున్నారు.ఇప్పుడు తన టార్గెట్ మాత్రం రాబోయే “యన్.టి.ఆర్”మహానాయకుడు అంటూ షాకిచ్చారు.లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకి సంబందించిన ట్రైలర్ ను ఈ నెల 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదల చేస్తానని ఇదివరకే స్పష్టం చెయ్యగా..

అసలు విడుదల అవుతుందా లేదా అని అనుకున్న “యన్.టి.ఆర్”మహానాయకుడు సినిమాను ఈ నెల 22 న విడుదల చేయబోతున్నట్టు కూడా స్పష్టమయ్యింది.దీనితో ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఈ లక్ష్మిస్ ఎన్టీఆర్ ట్రైలర్ ను రాబోయే “యన్.టి.ఆర్”మహానాయకుడు సినిమా విడుదల ప్రింట్ తో పాటు అటాచ్ చేసి విడుదల చేస్తానని షాకిచ్చారు.ఒక పక్క ఆ సినిమా ఇప్పుడు మరో సినిమా ఈ రెండు వేర్వేరు ఇతిహాసాలుతో వస్తున్నాయి,దీనితో రామ్ గోపాల్ వర్మ ఇచ్చే ట్విస్టులకి కొంత మంది ఖంగారు పడుతున్నా మరో వర్గం మాత్రం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.