రాంగోపాల్ వర్మ షాకింగ్ ట్వీట్..తెలుగు తమ్ముళ్లకు ముచ్చెమటలు..లక్ష బహుమతి!

Saturday, October 13th, 2018, 03:18:54 PM IST

భారతదేశ అందరి దర్శకుల్లో వివాదాస్పద దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది రాంగోపాల్ వర్మ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ఎప్పుడు ఏదోకటి చేసి వివాదాల్లో ఇరుక్కుంటారు.అయినా సరే వాటిని పట్టించుకోరు.ఇప్పుడు తాజాగా మళ్ళీ వార్తల్లోకి ఎక్కారు.ఇప్పటికే నిన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ దసరాకి చిత్రాన్ని మొదలు పెడుతున్నా అని అన్న గారు మరియు చంద్రబాబు గారు ఉన్న ఒక ఫోటోని పెట్టి సంచలనాన్ని సృష్టించాడు.

ఇప్పుడు కూడా తాజాగా సోషల్ మీడియాలో అచ్చు గుద్దినట్టు చంద్రబాబులా ఉన్నటువంటి మనిషి ఉన్న వీడియో విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి వీడియోని తీసుకొచ్చి ఏకంగా తన ట్విట్టర్ ఖాతాలోనే వేసేసారు.దానికి తోడు ఆ వీడియో లో ఉన్న వ్యక్తి యొక్క చిరునామాని ఎవరైతే తాను ఇచ్చిన ఈ మెయిల్ కి ముందుగా పంపిస్తారో వారికి ఒక లక్ష రూపాయల బహుమతి కూడా అందిస్తానన్నారు.ఇప్పుడు ఈ విషయం పై తెలుగు తమ్ముళ్లు ఎలా స్పందిస్తారో చూడాలి.