టీడీపీ హ‌యాంలో వేల‌కోట్ల అవినీతి జ‌రిగింది.. రాంమాధ‌వ్ సంచ‌ల‌నం..!

Tuesday, October 23rd, 2018, 01:38:04 PM IST

ఏపీ అధికార తెలుగు దేశం పార్టీ పై బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రా మాధ‌వ్ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. తెలుగు ప్ర‌జ‌ల‌కి తెలుగు దేశం పార్టీ శాపంగా మారింద‌ని.. దోచుకోవ‌డ‌మే ఆపార్టీ ముఖ్య ల‌క్ష‌ణ‌మ‌ని.. ప్ర‌జా ధ‌నాన్ని లూటీ చేయ‌డ‌మే టీడీపీ క‌ర్త‌వ్య‌మ‌ని.. క‌రెక్టుగా చెప్పాలంటే.. టీడీపీ ఓ తెలుగు దోపిడీ పార్టీ అని.. అదొక ఆంబోతుల పార్టీ అని.. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అక్క‌డి ప్ర‌జ‌లు టీడీపీని త‌రిమి కొట్టాల‌ని.. రాం మాధ‌వ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

తాజ‌గా మీడియా ముందుకు వ‌చ్చిన రాం మాధవ్.. అగ్రిగోల్డ్ వ్య‌వ‌హారం పై కూడా స్పందించారు. టీడీపీ హ‌యాం అగ్రిగోల్డ్ అతి పెద్ద స్కాం అని.. ఆరోపించారు. అంతే కాకుండా టీడీపీ హ‌యాంలో వేల‌కోట్ల అవినీతి జ‌రిగింద‌ని.. అయితే వాటి పై ఎవ‌రైనా ప్ర‌శ్నింస్తే వారి పై కేసులు పెట్టి చిత్ర హింస‌లు పెట్టి వాళ్ళ నోళ్ళు మూయిస్తున్నార‌ని.. అదే విధంగా బీజేపీ అధికారంలో ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి అవినీతి జ‌రిగినా.. వెంట‌నే చర్య‌లు తీసుకుని బాధితుల‌కు న్యాయం చేశామ‌ని రాంమాధ‌వ్ అన్నారు. ఇక ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో స‌హా ఏపీకి కేంద్రం ఎలాంటి స‌హాయం చేయ‌డంలేద‌ని ప్ర‌చారం చేస్తున్నార‌ని.. ఏపీకి పెద్ద మొత్తంలోనే నిధులు కేటాయించామ‌ని సీయ‌స్ స్థాయి అధికారులే తేల్చేశార‌ని రాంమాధ‌వ్ అన్నారు. అతి త్వ‌ర‌లోనే టీడీపీ బండారాలు అన్నీ బ‌య‌ట‌పెడుతామ‌ని రాం మాధవ్ స్పష్టం చేశారు. మ‌రి టీడీపీ పై ఈ బీజేపీ నేత వ్యాఖ్య‌ల పై టీడీపీ శ్రేణులు ఎలా స్పందిస్తారో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments