“ఇస్మార్ట్ శంకర్” వెర్షన్ 2.0 మాములుగా లేడుగా..!

Wednesday, March 13th, 2019, 08:26:01 PM IST

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా,నభా నటాష్ మరియు నిధి అగర్వాల్ లు హీరోయిన్లుగా పూరి జగన్నాద్ ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం “ఇస్మార్ట్ శంకర్”.ఈ సినిమా మొదలు పెట్టినపుడు ఏ అంచనాలు లేకపోయినా పూరి తన మార్క్ పోస్టర్ ను విడుదల చెయ్యడంతో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా నిలిచారు.ఇప్పటికే ఈ ఇద్దరికి సరైన హిట్ లేదు..దీనితో ఈ ఇద్దరికీ సరైన హిట్ ఎట్టి పరిస్థితుల్లోనూ దొరకాల్సిందే..మరి ఆ హిట్ కోసం పూరి మరియు రామ్ లు ఈ సినిమా కోసం గట్టిగానే కష్టపడుతున్నట్టుంది.ఇంకా ఈ సినిమా పూర్తి కాకముందే పూరి దీనికి సీక్వెల్ కూడా చేస్తున్నానని “డబుల్ స్మార్ట్ శంకర్” అనే టైటిల్ ని కూడా రిజిస్టర్ చేయించేసారు.

ఇప్పుడు ఈ సినిమా కోసమే రామ్ కూడా తన లుక్ ని పూర్తిగా మార్చేసి సరికొత్తగా రఫ్ లుక్ లో కనిపిస్తూ అభిమానులకు కిక్ ఇస్తున్నారు.అలాగే ఇప్పుడు ఈ ఇస్మార్ట్ శంకర్ అప్డేటెడ్ వెర్షన్ ని కూడా రామ్ పరిచయం చేసారు.రామ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తాను జిమ్ లో చేస్తున్న కసరత్తులు ఫోటోలు వదిలారు.దీనితో అభిమానులు నుంచి ఊహించని స్పందన వస్తుంది.రామ్ పెట్టిన ఈ ఫోటోలకు పూరి కూడా “మై ఇస్మార్ట్ హీరో’ అంటూ తానో ట్వీట్ చేసారు.ఏది ఏమైనా ఇప్పుడు రామ్ వదిలిన ఈ లుక్స్ మాత్రం మంచి రెస్పాన్స్ ని రాబడుతున్నాయి.