మోడీకి కూడా అంత ఉండదు..కోహ్లీ ఇది టూ మచ్..!

Sunday, January 21st, 2018, 12:11:49 PM IST

అటు బీసీసీఐ, ఇటు విరాట్ కోహ్లీ ఓవర్ యాక్షన్ చేస్తున్నారని క్రికెట్ చరిత్ర కారుడు రామచంద్ర గుహ మండిపడ్డారు. బీసీసీఐ విరాట్ కోహ్లీ భజన చేస్తోంది. కనీసం భారత కేబినెట్ కూడా ఇంతలా నరేంద్ర మోడీ భజన చేయదని ఆయన అభివర్ణించారు. ఈ సంద్భర్భంగా ఆయన కోహ్లీ, బీసీసీఐ తీరుని తప్పుబట్టారు. బీసీసీఐ అధికారులు స్వతంత్రంగా వ్యవహరించడం ఎప్పుడో మరచిపోయారు. ప్రతి చిన్న విషయంలో కూడా కోహ్లీ ప్రమేయం ఉంటోంది. దీనికి బీసీసీఐ ఏ మాత్రం అడ్డు చెప్పడం లేదు.

కోహ్లీ ముందు బీసీసీఐ అధికారులు, సెలెక్టర్లు మరియు సిబ్బంది మరగుజ్జుల్లా కనిపిస్తున్నారని సంచలన ఆరోపణలు చేసారు. ఇప్పటి వరకు బీసీసీఐలో బంధు ప్రీతి, అవినీతి అధికంగా ఉండేది. దేనికి తోడు ఇప్పుడు సూపర్ స్టార్ సిండ్రోమ్ కూడా వ్యాపించిందని దుయ్యబట్టారు. భారత టూర్ షెడ్యూల్ మరియు జాతీయ స్థాయి క్రికెట్ లో కూడా కోహ్లీ ప్రమేయం లేకుండా జరగడం లేదు. ఇది ఆమోదయోగ్యమైంది కాదు. కోహ్లీకి తలొగ్గకుండా కుంబ్లే మాత్రమే స్వతంత్రంగా పనిచేశాడు. అందుకే వారి మధ్య విభేదాలు తలెత్తినట్లు కూడా రామచంద్ర గుహ సంచలన ఆరోపణలు చేశారు. దీనికి బీసీసీఐ ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి.