రాజీనామాకు రెడీ..బాబుదే ఫైనల్ డెసిషన్..!

Thursday, February 1st, 2018, 09:48:43 PM IST

ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ పై టిడిపి నేతలు ఒక్కొక్కరుగా అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు బడ్జెట్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. కేంద్ర బడ్జెట్ లో అసలు ఆంధ్రప్రదేశ్ ప్రస్తావనే లేకపోవడం పై రామ్మోహన్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ తప్ప మరే రాష్ట్రమూ ఆర్థిక లోటు తో లేదని అన్నారు. అలాంటి రాష్ట్రానికి బడ్జెట్ లో కనీసం కేటాయింపులు లేకపోవడం ఏంటని రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు. కేంద్రంపై పోరాటానికి తమ అధినేత చంద్రబాబుదే తుది నిర్ణయం. రాజీనామాలకైనా సిద్దపడి ఉన్నాం అని రామ్మోహన్ నాయుడు అన్నారు.

విభజన హామీలు నెరవేర్చమని ఇప్పటికి అనేక మార్లు కేంద్రం చుట్టూ తిరిగాం. రాష్ట్రానికి ఇచ్చిన హామీలన్నింటిని తుంగలో తొక్కారు. టీడీపీ మిత్రధర్మం పాటిస్తోందని రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇండియాలోనే ఉంది కదా అంటూ రామ్మోహన్ నాయుడు బడ్జెట్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు.