షాక్‌ : ఒక క‌న్ను క‌నిపించ‌ని హీరో!?

Saturday, June 2nd, 2018, 11:38:31 AM IST

క్ష‌ణం తీరిక లేనంత బిజీబిజీగా ఉన్నాడు యువ‌హీరో రానా. బాహుబ‌లి భ‌ళ్లాల‌దేవ‌గా గ్రాండ్ స‌క్సెసైన రానాకు ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ్‌, హిందీలో అసాధార‌ణ క్రేజు నెల‌కొంది. ఆ క్ర‌మంలోనే అత‌డు వ‌రుస పెట్టి క్రేజీ సినిమాల్లో న‌టించేందుకు సంత‌కాలు చేశాడు. బాలీవుడ్‌లో క్లాసిక్ మూవీ హాథీ మేరా సాథీ టైటిల్‌ని ఎంపిక చేసుకుని, ప్ర‌భు సోల్మ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ త్రిభాషా చిత్రాన్ని ప్లాన్ చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా ఆన్‌సెట్స్ ఉంది. దీపావ‌ళికి రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నారు. మ‌రోవైపు వేరొక పీరియ‌డ్ సినిమాలో న‌టిస్తున్న రానా, స్టూవ‌ర్డ్‌పురం దొంగ టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు పాత్ర‌లో న‌టించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు.

అదంతా అటుంచితే రానాకి సంబంధించిన ఓ టాప్ సీక్రెట్ ఇప్పుడు అభిమానుల్ని క‌ల‌వ‌ర‌పెడుతోంది. రానాకి చిన్న‌ప్ప‌టినుంచి ఒక క‌న్ను క‌నిపించ‌దు. ఉన్న ఒక కంటితోనే మిలియ‌న్ డాల‌ర్ బిజినెస్‌ని అత‌డు మ్యానేజ్ చేసేస్తున్నాడు. ఇదివ‌ర‌కూ హైద‌రాబాద్ మ్యాక్సివిజ‌న్ కంటి చికిత్స నిపుణుడు డా.స‌తీష్ అత‌డి కంటికి ఆప‌రేష‌న్ చేశారు. కానీ ఇప్పుడు దానికి శాశ్వ‌త ప‌రిష్కారం కోసం విదేశాల్లో చికిత్స చేయించ‌నున్నార‌ని తెలుస్తోంది. ఈపాటికే రానా ఆప‌రేష‌న్ టేబుల్‌పైకి వెళ్లాల్సింది. అత‌డి హై బీపీ వ‌ల్ల వాయిదా వేశారు. సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే రానా కుడి కంటికి శ‌స్త్ర చికిత్స పూర్తి చేయ‌నున్నార‌ట‌. ప్ర‌స్తుతం విదేశీ వైద్యులు వెయిటింగ్. రానా శ‌స్త్ర‌చికిత్స విజ‌య‌వంత‌మై, అత‌డు అసాధార‌ణ స్టార్‌డ‌మ్‌ని అందుకోవాల‌ని మ‌న‌స్ఫూర్తిగా అభిమానులు కోరుకుంటున్నారు.