మొత్తానికి రంగస్థలం వసూళ్లు ఇలా ముగిసాయి?

Friday, June 8th, 2018, 11:14:01 AM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం చిత్రం టాలీవుడ్ లో నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టింది. ఏకంగా 220 కోట్ల భారీ వసూళ్లతో దుమ్ము రేపింది. సమంత హీరోయిన్ గా మైత్రి మూవీస్ నిర్మించిన ఈ సినిమా 127 కోట్ల షేర్ ని రాబట్టి మేగా పవర్ స్టార్ స్టామినా మరోసారి ప్రూవ్ చేసింది. 1980 నేపథ్యంలో గ్రామీణ కథతో సాగిన రంగస్థలం విడుదలైన అన్ని కేంద్రాల్లో భారీ వసూళ్లు అందుకుంది. ఇక మార్చ్ 30 న విడుదలైన ఈ సినిమా వసూళ్లు ఎలా ఉన్నాయో చూద్దాం.
షేర్ లలో .. నైజాం – 28. 72 కోట్లు, సీడెడ్ – 18. 35 కోట్లు, ఉత్తరాంధ్రా – 13. 57 కోట్లు, గుంటూరు – 8. 58 కోట్లు, కృష్ణా – 7. 10 కోట్లు, ఈస్ట్ – 8. 00 కోట్లు, వెస్ట్ – 6. 50 కోట్లు, నెల్లూరు – 3. 51 కోట్లు, ఆంధ్రా – తెలంగాణ కలిపి – 94. 33 కోట్లు, కర్ణాటక – 9. 47 కోట్లు, ఓవెర్సెస్ – 18 కోట్లు, రెస్ట్ అఫ్ ఇండియా – 2. 70 కోట్లు, ఓవర్ఫ్లో – 2. 50 కోట్లు, మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా కలిపి – 127 కోట్ల షేర్ రాబట్టింది. రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా దసరాకు విడుదల కానుంది.