హోదా ఉద్యమంలో ‘రంగస్థలం’ పాట

Monday, April 16th, 2018, 02:29:20 PM IST

ప్రస్తుతం ఆంధ్ర లో ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష పార్టీలన్నీ తీవ్ర నిరసనలు, ధర్నాలు చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే అధికార టిడిపి కూడా బిజెపి పై అలానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విధానాలపై వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. కాగా నేడు కేంద్ర బిజెపి ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ ప్రతిపక్షాలు అన్నీ ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులోభాగంగా ప్రత్యేక హోదా కోసం నెల్లూరు జిల్లాలో వామపక్షాలు వినూత్నంగా నిరసన తెలిపాయి. రంగస్థలంలోని ‘ఆ గట్టునుంటావా నాగన్న’ పాటకు డ్యాన్సులు చేస్తూ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు.

హోదా, విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం శ్రేణులు వినూత్న నిరసన తెలిపారు. బంద్‌లో పాల్గొన్న సీపీఎం నేతలు, కార్యకర్తలు తలకిందులుగా నిలబడి నిరసనకు దిగారు. ఏపీ అభివృద్ధిని తలకిందులు చేసిన నరేంద్ర మోదీ డౌన్‌ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఏపీ పట్ల కేంద్రం తీరును నిరసిస్తూ జిల్లాలో వామపక్షాల నేతలు, కార్యకర్తలు కబడ్డీ ఆడారు. నరేంద్ర మోదీ డౌన్‌ డౌన్ అంటూ కూతకు వెళ్లారు. బస్టాండ్‌ను ముట్టడించి రాకపోకలను అడ్డుకున్న సీపీఐ నేతలు రోడ్డుపై ఈ తరహా ఆందోళన చేశారు……