బ్లడ్ గ్రూప్ వేరైనా.. కిడ్నీ ఆపరేషన్ సక్సెస్!

Friday, May 4th, 2018, 08:50:21 AM IST

పెరుగుతున్న టెక్నాలిజీ వ్యవస్థతో మనిషి తన ప్రతి పనిని చాలా వేగంగా సురక్షితంగా చేయగలుగుతున్నాడు. ప్రస్తుతం ఆరోగ్య వ్యవస్థలో కూడా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే సాధారణంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఏ వ్యక్తికైనా అవయవదానం చేసినప్పుడు దాత బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవుతుందా లేదా అనేది తప్పకుండా చూస్తారు. అలా కాకుంటే శరీరం అవయవాన్ని తరస్కరించే ప్రమాదం ఉంది. అయితే రీసెంట్ హైదరాబాద్ కేర్ ఆస్పత్రి వైద్యులు బ్లడ్ గ్రూప్ వేరైనప్పటికీ కిడ్నీ మార్పిడి చేసి శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. బి’పాజిటివ్‌ బ్లడ్‌గ్రూప్‌ స్వీకర్తకు ‘ఎ’పాజిటివ్‌ దాత కిడ్నీని ‘ఏబీవో ఇన్‌కాంపిటెబుల్‌’పద్ధతిలో సెట్ చేసి విజయవంతంగా శస్త్ర చికిత్స చేయడం చర్చనీయంగా మారింది.

ఈ సందర్బంగా వైద్యులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. అస్సాంకు చెందిన నిలాధన్‌ సింఘా(42). స్వీకర్త లువాంగ్‌ సింఘా(37) లను పరిచయం చేశారు. వారిద్దరు ఆరోగ్యంగా ఉన్నారని తెలుపుతూ.. జరిగిన చిక్కిత్స గురించి వివరించారు. కిడ్నీ సమస్యతో వైద్యులను ఆశ్రయించిన వ్యక్తికి మొదట అదే బ్లడ్ గ్రూప్ తో ఉన్న ధాత నుంచి కిడ్నీ మార్పిడి చేయాలనీ అనుకున్నారు. కానీ దాతలెవ్వరు ముందుకు రాకపోవడంతో చివరికి రోగి భార్యే ముందుకు వచ్చింది. కానీ ఇద్దరి బ్లడ్ గ్రూప్స్ వేరు వేరుగా ఉన్నాయి. స్వీకర్త బ్లడ్‌గ్రూప్‌ ‘బి’పాజిటివ్‌ కాగా, దాతది ‘ఎ’పాజిటివ్‌ గా ఉండడంలో వైద్యులు ‘ఏబీవో ఇన్‌కాంపిటెబుల్‌’ ద్వారా చిక్కిత్స చేయగా ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. ఏప్రిల్ మొదటి వారంలో ఈ ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం వారిద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Comments