కేరళకు మరో సమస్య.. రాట్ ఫీవర్!

Tuesday, September 4th, 2018, 09:43:12 AM IST

100 ఏళ్ల తరువాత కేరళ రాష్ట్రాన్ని ఇటీవల వరదలు బారి దెబ్బ కొట్టిన సంగతి తెలిసిందే. ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా చాలా ప్రాంతాలను వర్షలు ముంచెత్తాయి. భవనాలు సైతం వరదల ధాటికి కొట్టుకుపోయాయి. కేరళ కోలుకోవడానికి సమయం చాలా పడుతుంది. కేరళ ప్రభుత్వం కేంద్రం సహాయంతో సహాయక చర్యలను ఇంకా కొనసాగిస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో వారికి మరో సమస్య సవాలుగా మారింది. ‘రాట్ ఫీవర్’ అనే మహమ్మారి కేరళవాసులను భయానికి గురి చేస్తోంది.

ఈ వ్యాధి కారణంగా ఇప్పటికే 9 మంది మరణించినట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే 200 మందికి పైగా వ్యాధి బారిన పడినట్లు తెలుస్తోంది. నీటిలో జంతువుల మూత్ర కలిసినందు వల్ల బ్యాక్టీరియా ప్రబలుతుంది. అందువల్ల ఈ వ్యాధి సోకుతోంది. నీటిలో పని చేసే వారు ఎక్కువగా ‘రాట్ ఫీవర్’ బారిన పడుతున్నారు. వరద సహాయక చర్యల్లో నిత్యం పనిచేస్తున్నసిబ్బందికి ‘రాట్ ఫీవర్’ ను నివారించే ‘డాక్సీ సెలైన్’ టాబ్లెట్లను ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కండరాల నొప్పి తలనొప్పి రక్తస్రావం, వాంతులు వంటివి ఈ వ్యాధి లక్షణాలు అని కేరళ ప్రభుత్వం అలెర్ట్ ప్రకటించింది. అంతే కాకుండా ప్రత్యేక వైద్య బృందాలను రంగంలోకి దింపి రాట్ ఫీవర్ వ్యాపించకుండా చేయాలనీ ఆదేశాలను జారీ చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments