హోటల్ బిర్యానీలో ఎలుక……షాక్ లో కస్టమర్లు!

Tuesday, June 12th, 2018, 08:32:02 PM IST

మనలో చాలామంది ఎక్కడైనా, ఎప్పుడైనా హ్యాపీగా, హాయిగా ఎంజాయ్ చేస్తూ తినే ఐటెం ఏది అని అడిగితే, ఠక్కున చాలా మందికి గుర్తుకు వచ్చేపేరు బిరియాని. ఆదివారం వచ్చిందంటే చాలు బిరియాని ప్రియులు హోటళ్లలో, రెస్టారెంట్లలో తెగ క్యూలు కడుతుంటారు. అయితే నేడు అంత అమితంగా ఇష్టపడి మనం తినే ఒక హోటల్ బిర్యానీలో ఎలుక రావడంతో అక్కడి కస్టమర్లు బిత్తరపోయారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే, వరంగల్ జిల్లా అర్బన్ నియోజకవర్గ పరిధిలోని హన్మకొండ సుబేదారిలోని రోహిణి ఆసుపత్రి పక్కన వున్న ఒక హోటల్ కు మంచి ఆకలితో బిర్యానీ కోసం అందరివలె ఒక వ్యక్తి కూడా వెళ్ళాడు. అయితే అతడు ఆర్డర్ ఇచ్చిన బిర్యానీ వేడివేడిగా రావడంతో లొట్టలు వేసుకుంటూ తింటున్నాడు.

ఇంతలోనే చికెన్ ముక్క తిందామని అనుకుని పరిశీలించి చూస్తే అది చికెన్ కాదు సరికదా ఎలుక అని తెలియడంతో అతడు ఒక్కసారిగా షాక్ లో వుండిపోయాడు. అతని ప్లేటులో ఎలుక రావడాన్ని గమనించిన మిగిలిన కస్టమర్లు కూడా నిర్ఘాంతపోక తప్పలేదు. వెంటనే దానిని తీసుకెళ్ళి హోటల్ యజమానికి చూపించగా అతడు నీళ్లు నములుతూ సరిగ్గా సమాధానం చెప్పలేకపోయాడు. అంతేకాక ఎలుకను చూపిన ఆ కస్టమర్ పై దాడికి కూడా పాల్పడబోయాడు. అయితే ఈ మొత్తం ఉదంతాన్ని చూస్తున్న మిగతా కస్టమర్లు హోటల్ లో పదార్ధాలు ఈ విధంగా అశ్రధ్ధతో చేయడంపై అతన్ని నిలదీశారు……