రవిప్రకాష్, కెసిఆర్ ని ఎందుకు టార్గెట్ చేశాడు…?

Thursday, May 16th, 2019, 01:31:33 AM IST

గతకొంత కాలంగా నేరారోపణలతో సహవాసం చేస్తున్నటువంటి టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ ప్రస్తుతానికి అజ్ఞాతవాసంలో ఉన్న సంగతి తెలిసిందే… కాగా రవిప్రకాష్ ఎప్పుడు బయటకు వస్తే అప్పుడు అరెస్టు చేద్దామని తెలంగాణా పోలీసులు వేచి చూస్తున్నారు… కాగా రవిప్రకాష్ ముందస్తు బెయిల్ కి పిటిషన్ చేయగా దానిని హై కోర్ట్ నిరాకరించింది. ఈ సందర్భంగా అజ్ఞాతంలోనే ఉన్నటువంటి రవిప్రకాశ్ ఒక ప్రైవేట్ మీడియా సంస్థ కు తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే తాను ఇటీవల తెలంగాణ విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని చేయగా, ఆ కార్యక్రమాన్ని చేసినటువంటి తెలంగాణ నేతలు తనపై కక్షతో తన మీద ఇన్ని ఆరోపణలు చేస్తున్నారని రవిప్రకాష్ అన్నారు. వారు చేసినటువంటి అనవసరమైనటువంటి ఆరోపణల వల్లనే తనని టీవీ9 నుండి బయటకు పంపించారని రవిప్రకాష్ అన్నారు.

కాగా ఈ ఇంటర్వ్యూ లో రవిప్రకాష్ పక్కాగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ని టార్గెట్ చేశారని తెలుస్తుంది. కెసిఆర్ మీద తప్పుడు ఆరోపణలు సృష్టిద్దామని ప్రణాళిక ప్రకారమే రవిప్రకాష్ ఇవన్నీ చేస్తున్నారని, పలువురు విశ్లేషకులు అంటున్నారు. కాగా ఈ నెల్లోనే తెలంగాణలో ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, కానీ టీవీ9 ను అలంద మీడియా టేకోవర్ చేసి చాలా రోజులు అయిందని స్పష్టంగా తెలుస్తుంది. అయితే విద్యార్థుల ఆత్మహత్యల తర్వాతే కేసీఆర్ తీవ్రమైన నిర్ణయానికి వచ్చి టీవీ9 నుండి రవిప్రకాష్ ని బయటకు పంపించారని మీడియా వర్గాల కథనం.