ధోని ఎలాంటి వాడో మాకు తెలుసు.. లక్ష్మణ్ కి రవిశాస్త్రి కౌంటర్

Sunday, November 12th, 2017, 03:50:59 AM IST

ప్రస్తుతం ఇండియా క్రికెట్ జట్టు వికెట్ కీపర్ అండ్ బ్యాట్స్ మెన్ మహేంద్ర సింగ్ ధోనిపై గత కొంత కాలంగా విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇటీవల జరిగిన న్యూజిలాండ్ టీ20 మ్యాచులలో అతని ప్రతిభ అంతగా బాగాలేదని జూనియర్లకు అవకాశం ఇస్తే బావుంటుందని కొందరు సీనియర్ ప్లేయర్స్ కామెంట్స్ చేశారు. అంతే కాకుండా కొన్ని జాతీయ మీడియాల్లో కూడా ధోని ఆటపై కథనాలను ప్రసారం చేశాయి. దీంతో ధోనికి మద్దతుగా జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అలాగే మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ నిలిచారు. అయితే రీసెంట్ గా కోచ్ రవి శాస్త్రి కూడా ఈ విషయంపై తనదైన శైలిలో స్పందించాడు.

రవి శాస్త్రి మాట్లాడుతూ.. ధోని ఎలాంటి ఆటగాడో అందరికి తెలుసు. అతనిపై కావాలని విమర్శలు చేస్తూ..బ్యాడ్ డేస్ రావాలని ఆశిస్తున్నారు. కానీ ధోని మంచి ఆటగాడు. అతనిపై వస్తున్న విమర్శల వలన ఏమి జరగదు. ధోని లాంటి ఆటగాళ్లు వారి భవిష్యత్తుపై వాళ్లే నిర్ణయం తీసుకుంటారు. జట్టు సారధిగా ఉండి ధోని ఎన్నో విజయాలను అందించాడు. అతను ఎలాంటి ఆటగాడో మాకు తెలుసని విమర్శలు చేసేవారికి కౌంటర్ చేశారు. రీసెంట్ గా సీనియర్ ప్లేయర్స్ అజిత్ అగార్కర్ – వివిఎస్ లక్ష్మణ్ ధోని టీ20ల నుంచి తప్పుకుంటే మంచిదని కామెంట్ చేశారు. అందుకే రవిశాస్త్రి వారికి పరోక్షంగా సమాధానం ఇచ్చారని వార్తలు వస్తున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments