భారత కోచ్ రవిశాస్త్రి ట్వీట్ వైరల్… తాగుబోతు అంటూ కామెంట్స్!

Wednesday, August 8th, 2018, 06:30:04 PM IST

ఇండియన్ క్రికెట్ టీం హెడ్ కోచ్ రవి శాస్త్రి పై కొద్దిరోజులనుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో నిద్రిస్తున్న రవిశాస్త్రి పై కొందరు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఇక ఇప్పుడు ఆయన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఒక ఫోటో వల్ల మరిన్ని విమర్శలను ఎదుర్కొనవలసి వస్తోంది. ఇక్కడ ఇంగ్లాండ్ లో చాలా వేడిగా వుంది, అందుకే ఈ ఎండల నుండి కాస్త సేదతీరేందుకు ఈ డ్రింక్ తాగుతున్నాను అంటూ, ఒక డ్రింక్ బాటిల్ పట్టుకుని రవిశాస్త్రి ఫోటో దిగారు. మీరు కూడా ఈ డ్రింక్ తాగి కాస్త ఉపశమనం పొందండి అని చేసిన ట్వీట్ పై చాలా మంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లార్డ్స్ లో ఒకప్రక్క ఆటగాళ్లు కష్టపడుతూ గేమ్ ఆడుతుంటే, మరొకప్రక్క మీరు ఇలా తాగుతూ వీధుల్లో ఎంజాయ్ చేయడమేంటనీ, టెస్ట్ గెలవాలన్న ఉత్సుకత మీలో లేదని కామెంట్స్ చేస్తున్నారు.

ఇకనైనా మీ ఎంజాయిమెంట్ ఆపి వెళ్లి టీం కి కాస్త గట్టిగా కోచింగ్ ఇవ్వండి, యావత్ భారతావని అంతా ఇండియా గెలుపుకోసం ఆశగా ఎదురుచూస్తోంది అంటూ సెటైర్లు వేస్తున్నారు. మరోవైపు ఇటీవల టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రవిశాస్త్రి ని ఉద్దేశించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు. రవిని ఉదయంపూట ఎవరూ ఇంటర్వ్యూ చేయలేరని, ఎందుకంటే ఆ సమయంలో అయన ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదని విమర్శించాడు. ఈ విధంగా కొద్దిరోజులనుండి పలురకాలుగా విమర్శలు ఎదుర్కొంటున్న రవిశాస్త్రి ఇకనైనా తన ధోరణి మార్చుకుని టీంకి విజయం అందించే దిశగా ముందుకువెళతారని క్రికెట్ ఫాన్స్ ఆశిస్తున్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments