కేటీఆర్ నువ్వొక పిల్ల కాకివి..అసలు ఏం తెలుసు నీకు..!?

Wednesday, November 7th, 2018, 04:17:35 PM IST

తెలంగాణలోని రాజకీయ శ్రేణుల మధ్య మామూలు స్థాయిలో మాటల దాడి జరగట్లేదు.ఒక పక్క తెరాస మరో పక్క మహా కూటమిలోని టీకాంగ్రెస్ మరియు టీటీడీపీ పార్టీలు ఒకరి మీద ఒకరు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలకు గాను అక్కడి టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.చంద్రబాబు రామారావు గారికి వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని లాక్కున్నాడని,అన్న కేటీఆర్ మాటలకు అక్కడి టీటీడీపీ నేత అయినటువంటి రేవూరి ప్రకాష్ రెడ్డి ఘాటుగా సమాధానం ఇచ్చారు.

కేటీఆర్ చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయాలకు అదొక నిదర్శనం అని మండిపడ్డారు.2008 నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి నీకు అసలు ఏం తెలుసని మండిపడ్డారు.అంతకు ముందు జరిగినటువంటి రాజకీయ పరిణామాల సమయంలోనీకు అసలు ఊహ కూడా తెలిసి ఉండదని సంచలన వ్యాఖ్యలు చేశారు.అసలు వయస్సు అనే నిమిత్తం లేకుండా చరిత్ర కోసం ఏమి తెలుసుకోకుండా సంస్కారం లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నాడు అని,ఈ రాజకీయాల్లో నువ్వొక పిల్లకాకివి అని కేటీఆర్ ని ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments