బిగ్ వైరల్: రాయదుర్గం పోలీస్ పోస్టల్ బ్యాలెట్.. షాక్‌లో వైసీపీ..!

Friday, May 17th, 2019, 06:28:01 PM IST

ఏపీలో మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలలో రోజురోజుకు కొత్త విషయాలు భయటకొస్తున్నాయి. ప్రజా రక్షణ కోసం పని చేయాల్సిన పోలీసులు రాజకీయ నాయకులతో చేతులు కలిపి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. అయితే ఈ ఎన్నికలలో రాయదుర్గం పోలీసులు టీడీపీ పార్టీ కార్యకర్తలుగా పనిచేసారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓటర్లను ప్రభావితం చేయడం కానుంచి, ఓట్లు వేయించే వరకు అన్నీ తామై చూసుకున్నారు పోలీసులు. అంతేకాదు మహిళా పోలీస్ వాలంటీర్ల పోస్టల్ బ్యాలెట్లను టీడీపీకి వేయాలని చెప్పారు. అడ్దు చెప్పిన వారిని భయపెట్టి మరీ ఈ పని చేసారు.

అయితే పూర్తి వివరాలలోకి వెలితే రాయదుర్గం అర్బన్‌ పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న ఓబుళపతి అనే హెడ్‌ కానిస్టేబుల్‌ మరికొందరు పోలీసులు కలిసి టీడీపీ కోసం పనిచేసారట. అయితే ఎన్నికల విధుల కోసం మహిళా పోలీస్ వాలంటీర్లను ఎంపిక చేసుకున్నారు. అయితే వారికి ఓటు వేసేందుకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కలిపించారు. ఇదంతా వారితో టీడీపీకి ఓట్లు వేయించేలా ముందుగానే వ్యూహం రచించిన పోలీసులు ఒక్కో మహిళా వాలంటీర్‌కు 1000 రూపాయల చొప్పున నగదు ఇచ్చి టీడీపీకి ఓటు వేయించారు. అడ్దు చెప్పిన కొందరు మహిళా వాలంటీర్లను ఉద్యోగం నుంచి పీకేస్తామని బెదిరించి మరీ టీడీపీకే ఓటు వేసేలా చేసారు. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి లక్షల్లో పోలీస్ స్టేషన్‌కు డబ్బు ముట్టిందని అందుకే వారు ఇదంతా చేసారని ఒక వీడియో భయటపడింది. అయితే ఇది తెలిసాక ఉన్నతాధికారులు హెడ్‌ కానిస్టేబుల్‌ను వీఆర్‌కు బదిలీ చేశారే తప్పా ఇంకే చర్యలు తీసుకోలేదు. అంతేకాదు ఈ సంఘటనకు పాల్పడిన వారిలో హెడ్‌ కానిస్టేబుల్‌తో పాటు మరో ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ కూడా ఉన్నారని ఆ వీడియోలో భయటపడింది. అయితే దీనిపై పూర్తి విచారణ జరిపితే పలువురు బాధిత మహిళా వాలంటీర్లు కూడా ఏం జరిగిందనే అంశంపై పూర్తి వివరణ ఇచ్చారు. ప్రస్తుతం ఆ వీడియో టేపులు బయటకు రావడంతో పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే ఇలా చట్ట విరుద్దమైన పనులు చేస్తున్నారని వైసీపీ శ్రేణులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు.