రాయుడు ఈజ్ బ్యాక్.. భారత జట్టులో స్థానం!

Wednesday, May 9th, 2018, 09:27:34 AM IST

ప్రస్తుతం యువ ఆటగాళ్లు ఐపీఎల్ లో దూకుడుగా రాణిస్తున్నారు. ఎవరిని సెలెక్ట్ చేయాలనే విషయంలో సెలక్టర్లకు పెద్ద పరీక్షగా మారుతోంది. అయితే గత కొన్ని రోజులుగా బిసిసిఐ సెలెక్షన్ కమిటీ చర్చలు జరిపి ఫైనల్ నెక్స్ట్ జరగబోయే ఇంగ్లాండ్ – ఐర్లాండ్ సిరీస్ లకు వివిధ ఫార్మాట్ లకు తగ్గటుగా జట్టును రెడీ చేసింది. జూన్ 14 నుంచ్ 18 వరకు అఫ్గానిస్థాన్‌ తో జరిగే ఏకైక చారిత్రక టెస్టు మ్యాచ్‌ కు కూడా జట్టు సభ్యులు సెలెక్ట్ అయ్యారు.

వన్డే జట్టులో కొత్తగా అంబటి రాయుడు చోటు దక్కించుకున్నాడు. గత కొన్ని రోజులుగా ఐపీఎల్ లో అతని ఆట ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీంతో అతనికి అవకాశం ఇచ్చారు. అలాగే కరుణ్ నాయర్ కు టెస్టులో అవకాశం దక్కింది. ఆఫ్ఘన్ టెస్టుకు కోహ్లీ దూరంగా ఉంటుండడంతో అజింక్యా రహానే కు కెప్టెన్ గా బాధ్యతలు ఇచ్చారు. రోహిత్ శర్మ కు టెస్ట్ మ్యాచ్ ల నుంచి ఉద్వాసన లభించింది. ఇక తరువాత ఇంగ్లాండ్ – ఐర్లాండ్ సిరీస్ లకు మళ్లీ కోహ్లీ అందుబాటులోకి రానున్నాడు. ఉమేష్ యాదవ్ – సిద్దార్థ్ కౌల్ కి మళ్లీ అవకాశం లభించగా అశ్విన్ – షమీ కి నిరాశ తప్పలేదు.

టెస్ట్ టీమ్ :

రహానె, ధావన్‌, విజయ్‌, రాహుల్‌, పుజారా, కరుణ్‌ నాయర్‌, సాహా, అశ్విన్‌, జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌, ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ షమి, హార్దిక్‌ పాండ్య, ఇషాంత్‌ శర్మ, శార్దూల్‌ ఠాకూర్‌.

ఇంగ్లాండ్ సిరీస్ కోసం వన్డే టీమ్ :

కోహ్లి, ధావన్‌, రోహిత్‌, రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రాయుడు, ధోని, చాహల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, హార్దిక్‌ పాండ్య, సిద్ధార్థ్‌ కౌల్‌, ఉమేశ్‌, శార్దూల్‌ ఠాకూర్‌, భువనేశ్వర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌.

ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌తో సిరీస్‌ల కోసం టీ20 టీమ్ :

కోహ్లి, ధావన్‌,. రోహిత్‌ శర్మ, రాహుల్‌, రైనా, మనీష్‌ పాండే, ధోని, దినేశ్‌ కార్తీక్‌, యుజ్వేంద్ర చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, భువనేశ్వర్‌, బుమ్రా, హర్దిక్‌ పాండ్య, సిద్ధార్థ్‌ కౌల్‌, ఉమేశ్‌ యాదవ్‌.

  •  
  •  
  •  
  •  

Comments