ఆధార్ భద్రత పై మరిన్ని అనుమానాలకు తావిస్తోన్న ఆర్బీఐ రిపోర్ట్

Tuesday, January 9th, 2018, 04:30:18 PM IST

ప్రతి ఒక్క ప్రభుత్వ పధకాల నుండి బ్యాంకు, ఇన్సురెన్సు, మొబైల్ వంటి ప్రతి ఒక్క అవసరానికి మన ఆధార్ నెంబర్ ను లింక్ చేయడం తప్పని సరి అయింది. ఈ క్రమం లో మన ఆధార్ డేటా యూఏడిఏఐ వద్ద ఎంత భద్రం గా ఉంటుందో అనే అనుమానాలు ప్రతి ఒక్కరిలోను వున్నాయి. ఓ వైపు ఆధార్ డేటా భద్రం గానే వుంది అని ప్రభుత్వం ఎంత ఊదరగొడుతున్నా రూ.500 కే ఈ డేటా మొత్తం ఆన్ లైన్ లో లభ్యం అవుతుందని వస్తున్న రిపోర్టులు ప్రజలను, నిపుణులను తీవ్ర భయ బ్రాన్తులకు గురి చేస్తున్నాయి. కేవలం ప్రైవేట్ అధ్యయనాలు మాత్రమే కాకుండా ఆర్బీఐ రీసెర్చర్లు కూడా ఆధార్ డేటా భద్రత పై పలు అనుమానాలు రేకెత్తించే విధంగా తమ రీసెర్చ్ పత్రాన్ని విడుదల చేశారు. ఆర్బీఐ కి చెందిన ఇన్ స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్, రేసెర్చింగ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ వారు సమర్పించిన రిపోర్టులో ఆధార్ భద్రత పై తీవ్రమైన లోపాలను ఎత్తి చూపింది.

ఆధార్ పలు సవాళ్ళను ఎదుర్కొంటోందని, దీనిలో యుఏడిఏఐ ప్రధాన సవాల్ తన అధీనంలో వున్నా ఆధార్ డాటాను భద్రపరచడమని పేర్కొంది. యుఏడిఏఐ ఒక్క అటాచ్ చేస్తే చాలు సైబర్ క్రిమినల్స్ వల్ల, దెశ వెలుపలి శత్రువుల వల్ల మన ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా చిన్నా భిన్నం అవుతుందని, దెశ పౌరుల గోప్యత ఒక్కసారిగా బహిర్గతం అవుతుంది. దానివల్ల జరిగే నష్టం ఏ మేర జరుగుతుందో అంచనాలకు కూడా చిక్కదు అని ఆ సంస్థ తెలియచేసింది బయోమెట్రిక్ వివరాలే నేడు దేశానికి ముఖ్య ఆస్తి అని ఆర్బీఐ రెసెర్చర్లు తెలిపారు. ఏమాత్రం చిన్న ఉల్లంఘన జరిగినా సమాచారం మొత్తం సైబర్ క్రిమినల్స్ కి వదులుకోవాసిందే అని, ఈ మేరకు పెద్ద మొత్తం లో సేకరిస్తున్న ఆధార్ డేటా ను ఏ విధంగా దుర్వినియోగ పరచవచ్చొ ఆర్బీఐ రెసెర్చర్లు తమ అధ్యయన రిపోర్ట్ లో తెలిపారు. ఇప్పటికైనా మన ప్రభుత్వం ఆధార్ డేటా భద్రత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.