తెలుగు రాష్ట్రాల్లో నగదు కొరతకు ఆర్బీఐ చెక్!

Thursday, March 29th, 2018, 06:30:50 PM IST


ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ఏటీఎంలలో నగదుకు తీవ్ర కొరత ఏర్పడిన నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఉపశమన చర్యలు ప్రారంభించింది. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఏటీఎంలలో నింపేందుకు ఇతర రాష్ట్రాల నుంచి నగదు తెప్పించే ప్రయత్నాలు చేస్తోంది. తెలుగు రాష్ట్రాల ఏటీఎంల్లో 50 శాతానికి పైగా ఏటీఎంలు పని చేయడం లేదు. అలానే పలు ఏటీఎంల ఎదుట ‘నో క్యాష్ బోర్డులు’ దర్శనమిస్తున్నాయి. అసలే పెళ్లిళ్ల సీజన్ కావడం, ఇంకో రెండు రోజుల్లో కొత్త నెల ప్రారంభం కావడంతో జనం డబ్బు కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దీంతో ఈ నగదు కొరతను పూడ్చడానికి ఆర్బీఐ తక్షణ చర్యలు చేపట్టింది. ఓ ఏపీకి ఒడిశా, తమిళనాడుల నుంచి నగదు రప్పిస్తుంటే మరోవైపు తెలంగాణకు కేరళ, మహారాష్ట్రాల నుంచి రప్పించి ఏటీఎంలలో నగదు నింపేందుకు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు ఇలా అన్నీ ఒకేసారి వస్తుండంతో నగదు కొరత లేకుండా చేసేందుకే ఈ రకమైన చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అందుకే ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు కూడా ముందస్తు చర్యలు చేపట్టారు. ఆర్బీఐ సూచలన మేరకు ఇతర రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాలకు నగదును రానుండడంతో కస్టమర్ లు ఆనందం వ్యక్తంచేస్తున్నారు…..