కోహ్లీ కెప్టెన్ పదవిపై అనుమానాలు.. క్లారిటీ వచ్చేసింది!

Monday, September 10th, 2018, 06:26:31 PM IST

ప్రపంచ వ్యాప్తంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు ఉండే ఆధారనే వేరు. సరికొత్తగా టీ20 ఫార్మాట్ కు అసలు మాజాని అందించిన ఐపీఎల్ లో ఫెవెరెట్ జట్టుగా ఆర్సీబీ ఉంది. అయితే జట్టులో స్టార్ ప్లేయర్స్ ఉన్నప్పటికీ కొని సీజన్స్ లలో విరాట్ సేన పాయింట్స్ టేబుల్ లో చతికిల పడింది. ఖరీదైన జట్లలో ఒకటైన రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపిఎల్ ట్రోపిని ఇంతవరకు అందుకోలేకపోయింది. గత పదేళ్లలో 2009, 2011, 2016 సీజన్స్ లలో ఫైనల్స్ కి చేరుకోవడం తప్పితే మిగతా సీజన్స్ లలో దారుణంగా విఫలమైంది.

అసలు విషయంలోకి వస్తే.. వచ్చే సీజన్ లో జట్టు కెప్టెన్ ను మార్చే అవకాశం ఉన్నట్లు కొన్ని రూమర్స్ వచ్చాయి. విరాట్ కోహ్లీని తొలగించి జట్టు బాధ్యతలని ఏబీ డివిలియర్స్ కు అప్పగించేందుకు జట్టు యాజమాన్యం ఆసక్తి చూపుతున్నట్లు కొన్ని మీడియాల్లో కథనాలు వచ్చాయి. అయితే ఈ విషయంపై ఆర్సీబీ మేనేజ్మెంట్ స్పందించింది. ఎట్టి పరిస్థితుల్లో కోహ్లీని తప్పించే ఆలోచనే లేదని అతను టీమ్ ను అద్భుతంగా నడిపిస్తున్నాడని పేర్కొంది. విరాట్ కోహ్లీకి ఆర్సీబీ ప్రతి ఏడాది 17 కోట్లు చెల్లిస్తోంది. కోచ్ గా ఉన్న న్యూజిలాండ్ మాజీ ఆటగాడు వెటోరిని తొలగించి టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్‌ కు కోచ్ గా నియమించారు.

  •  
  •  
  •  
  •  

Comments