రియల్ బాహుబలి ఎంటర్ అయ్యాడు..అమ్మాయిలు ఫిదా అయ్యారు..!

Monday, September 25th, 2017, 04:00:19 PM IST


బాహుబలి మొదటి భాగంలో శివలింగాన్ని హీరో ఎత్తుకునే సన్నివేశంలో ప్రభాస్ కిల్లింగ్ లుక్స్ ఇప్పటికి అభిమానుల కళ్ల ముందు మెదులుతూనే ఉంటాయి. అంత గొప్పగా ఆ సన్నివేశాన్ని రాజమౌళి డిజైన్ చేసారు. ఇప్పుడు ఇండియా మొత్తం బాహుబలి మానియా వ్యాపించేసింది. తాజగా మధ్య ప్రదేశ్ లో జరిగిన ఓ రియల్ సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో దసరా సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి.

ఈ సంబరాల్లో యువతీ యువకులు గర్బా నృత్యాలు చేయడం ఆనవాయితి. ఈ సారి నిర్వాహకులు కొంచెం కొత్తగా ఆలోచించారు. యువతీ యువకులు నృత్యం చేస్తుండగా మధ్యలో ఓ యువకుడు భారీ శివలింగాన్ని మోస్తూ ప్రభాస్ లాగా మోస్తూ ఎంట్రీ ఇచ్చారు. ఆ యువకుడి రాకకు అక్కడున్న యువతులంతా థ్రిల్ కి గురయ్యారు. అంతటితో ఆగని అమ్మాయిలు అతడితో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్గా మారాయి.

  •  
  •  
  •  
  •  

Comments