వాళ్ళ ఇద్దరినీ ఒక తల లేని దెయ్యం గోడకేసి కొట్టిందంట….!

Saturday, January 21st, 2017, 12:07:36 PM IST

dhayyam
ఒక తలలేని దెయ్యం వాళ్ళు ఇద్దరూ పడుకున్న రూమ్ లోకి వెళ్లి కర్రతో చితగ్గొట్టి, గోడకేసి బాదింది. దీంతో వాళ్ళ అరుపులతో చుట్టూ ఉన్న వాళ్ళు అక్కడకి చేరుకున్నారు. ఇదేదో రాంగోపాల్ వర్మ సినిమాలో సీన్ కాదు. నిజంగానే జరిగింది. అదికూడా ఎక్కడో కాదు మన రాజధాని నగరం హైదరాబాద్ లోనే జరిగింది. హైదరాబాద్ లోని పర్యాటక ప్రాంతాలను చూసేందుకు మహారాష్ట్ర నుండి డాక్టర్ సయ్యద్ ఫ్యామిలీ వచ్చింది. వాళ్లంతా చార్మినార్ దగ్గరలోని ఒక హోటల్ లో బస చేశారు.

చార్మినార్ దగ్గర ఉన్న ‘కోజీ లాడ్జి’ లో మూడు రూములు తీసుకున్నారు. రెండు రూమ్ లలో సయ్యద్ కుటుంబ సభ్యులు పడుకున్నారు. మూడవ రూమ్ లో తన తండ్రితో పాటు డాక్టర్ సయ్యద్ పడుకున్నారు. తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా సయ్యద్ పడుకున్న గదిలో నుండి కేకలు వినిపించడంతో పక్క రూమ్ లలో పడుకున్న కుటుంబ సభ్యులు భయంతో లాడ్జి నుండి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు సయ్యద్ ను ప్రశ్నించగా సయ్యద్ కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పారు. తాము నిద్రలో ఉండగా ఒక తలలేని దెయ్యం తమపై కర్రతో దాడి చేసిందని, తాము ప్రతిఘటించేలోపే తమను గోడకేసి కొట్టిందని చెప్పారు. ఈ మాటలకు అక్కడ ఉన్న అందరూ ఆశ్చర్యపోయారు. లాడ్జి యజమాని ఆ మాటలకు ఆశ్చర్యపోతూ… తమ లాడ్జి లో ఇంతకుముందు ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదని చెప్పారు. తండ్రి కొడుకులు ఇద్దరు గది నుండి తీవ్ర గాయాలతో బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు. కానీ సయ్యద్ చెప్పే దానిలో నిజమెంతో తెలియాల్సి ఉంది.