2.0..ఇప్పటికి 500 కోట్లు మాత్రమే రాబట్టడానికి బలమైన కారణమే ఉందా..?

Thursday, December 6th, 2018, 10:05:30 PM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా అద్భుత దర్శకుడు శంకర్ ల కాంబినేషన్ లో వచ్చిన భారీ విజువల్ వండర్ చిత్రం 2.0.సూపర్ స్టార్ రజిని శక్తివంతమైన రోబోగా నటిస్తే అంతకు మించిన బలమైన ప్రత్యర్థి పాత్రలో అక్షయ్ కుమార్ భయపెట్టారు.అయితే ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం అప్పటివరకు ఉన్న రికార్డులు అన్నింటిని బద్దలు కొట్టి సరికొత్త రికార్డులు నెలకొల్పుతుంది అని సినీ అభిమానులు అంతా ఆశించారు.కానీ ఊహించిన స్థాయిలో అయితే వసూళ్ళు రావట్లేదు.

సినిమా బాగున్నా సరే ఇంత తక్కువ వస్తున్నాయేంటి అన్న సందేహం కూడా అందరికి వస్తుంది.అయితే ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 3D మరియు 2D వెర్షన్ లలో ఎక్కువగా అయితే 3D లోనే విడుదల చేసారు.అయినా ఇప్పటికి కేవలం 500 కోట్లు మాత్రమే వచ్చాయి.దీనికి కూడా ఒక బలమైన కారణమే ఉందట.రెండు వెర్షన్లలో ఈ చిత్రాన్ని విడుదల చెయ్యగా అందులో 3D గ్లాసెస్ కి అయ్యే ఖర్చుని మినహాయించి ఈ వసూళ్లను ప్రకటిస్తున్నారు అని తెలుస్తుంది.అందువల్లనే ఇప్పటికి ఇంత తక్కువ వసూళ్లు వస్తున్నాయి అని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.మరి అలా అయితే బాహుబలి 2 కూడా 3D లో విడుదల కాకుండా అంత రాబట్టలేదా అంటే దానికి కూడా కారణం ఉంది.ఈ చిత్రం అంత స్థాయి హిట్ గా ప్రేక్షకులు ఆదరించకపోవడం వలన కూడా దెబ్బ పడింది అని ట్రేడ్ పండితులు అంటున్నారు.అయినా సరే ఈ రేంజ్ లో వసూళ్లు రావడం ఆశ్చర్యమే అని చెప్పాలి.