రంగస్థలం తర్వాత అనసూయకు ఆ రేంజ్ పాత్ర రాలేదెందుకు…?

Monday, February 11th, 2019, 06:10:02 PM IST

బులితెరపై తనదైన శైలిలో యాంకరింగ్ చేసి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది అనసూయ, ఒకప్పుడు టాలీవుడ్ లో అవకాశాల కోసం ఎదురు చుసిన అనసూయ యాంకర్ గా తన సత్త చాటి ఇప్పుడు అదే ఇండస్ట్రీ పిలిచి అవకాశాలు ఇచ్చేంత క్రేజ్ సంపాదించుకుంది. సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో నాగార్జున సరసన స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేసి అలరించిన అనసూయ తర్వాత క్షణం సినిమాతో తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకుంది. గత సంవత్సరం వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటనకు గాను విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

అయితే రంగస్థలం తర్వాత అనసూయ ఆ స్థాయిలో పర్ఫామెన్స్ కు స్కోప్ ఉన్న పత్రాలు రాలేదు, ఈ మధ్య అనసూయ చేసిన ఎఫ్2 సినిమాలో క్యారెక్టర్ పెద్దగా ఇంపార్టెన్స్ లేని క్యారెక్టర్. యాత్రలో కూడా ఆమెది చిన్న పాత్రే. యాత్రలో తన పాత్రకు మంచి అప్లాజ్ వచ్చిందంటూ అనసూయ సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ అభిమానులు మాత్రం అసంతృప్తిగా ఉన్నారు. అనసూయకు ఎక్కువ ఆఫర్లు రాకపోవటానికి కారణం ఆమె గ్లామర్ ప్రధాన పత్రాలు చేయటానికి మొగ్గు చూపకపోవటమే అని తెలుస్తుంది. అనసూయ కేవలం నటనకు ప్యాదాన్యం ఉన్న, డీగ్లామరస్ రోల్స్ చేయటానికే ఇష్టపడుతోందట.