కెసిఆర్ ఢిల్లీ పర్యటన వెనక అసలు కారణం

Monday, October 29th, 2018, 12:48:29 PM IST

తెలంగాణ లో ముందస్తు ఎన్నికల హడావుడి నెలకొంది. కెసిఆర్ తనదైన శైలి లో అనూహ్యంగా ముందస్తు ఎన్నికలకు సిద్దపడి ఇతర పార్టీలన్నిటిని ఇరకాటం లో పడేసారు. డిసెంబర్ మొదటి వారంలో జరగబోయే ఈ ఎన్నికల కోసం అన్ని పార్టీలు ప్రచారం ముమ్మరంగా సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం కెసిఆర్ ఢిల్లీ బయల్దేరి వెళ్ళటం సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఈ క్రమం లో సీఎం నుండి కెసిఆర్ కంటి పంటి పరీక్షల కోసం మాత్రమే ఢిల్లీ వెళ్లినట్టు ప్రకటన వెలువడింది.
తెలంగాణ ఎన్నికల నేపథ్యం లో కెసిఆర్ తీరిక లేకుండా ప్రచారంలో పాల్గొనబోతున్నారని కావున, వైద్యుల సూచనల ప్రకారం వైద్య పరీక్షల కోసమే కెసిఆర్ ఢిల్లీ వెళ్లినట్టు తెలుస్తుంది. అయితే కెసిఆర్ నిజంగానే వైద్య పరీక్షల నిమిత్తం ఢిల్లీ వెళ్ళారా లేక ఈ పర్యటన వెనక రహస్య రాజకీయ ఎజెండా ఏమైనా ఉందా అన్న ప్రశ్న వినిపిస్తుంది.

ఇదిలా ఉండగా ప్రస్తుతం ఎన్నికల ప్రచారం నేపథ్యంలో తెరాస అభ్యర్థులు ప్రజల నుండి వ్యతిరేకత ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సడెన్ గా కెసిఆర్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది, దీనికి వెనక ఎదో రహస్య ఉద్దేశం ఉన్నట్టు ఇతర పక్షాల నుండి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments