రాధ మౌనం వెనుక పెను ప్రమాదం పొంచి ఉందా ?

Thursday, October 11th, 2018, 11:05:56 PM IST

విజయవాడ రాజకీయాలని ఏ పార్టీ వైపుకైనా తిప్పగల సామర్థ్యం ఉన్న సామాజిక వర్గానికి నాయకుడు వంగవీటి రాధ. ముందుగా రాధాకు విజయవాడ సెంట్రల్ స్థానాన్ని ఇవ్వాలనుకున్నారు జగన్. కానీ సర్వేల్లో సెంట్రల్ నియోజకవర్గంలో బ్రాహ్మణుల ప్రాభల్యం ఎక్కువగా ఉన్నందున ఆ స్థానాన్ని మల్లాది విష్ణుకే వదిలేస్తే మంచిదని, రాధాను కాపు ప్రాభల్యం ఎక్కువగా ఉన్న తూర్పు నియోజకవర్గంలో పోటీ చేయమని నిర్ణయించారు.

ఇది నచ్చని రాధ జగన్ తో తీవ్రంగా విభేదించారు. కానీ జగన్ మాత్రం నిర్ణయాన్ని మార్చుకోలేదు. పోటీ చేస్తే చ్చజెప్పితిన్ చోచు నుండి చేయమని లేకవుంటే లేదని అల్టిమేటం జారీ చేశారట. దీంతో అభిమానులు, కార్యకర్తల్ని సమన్వయం పాటించమన్న రాధ చాలా రోజుల నుండి మౌనంగా ఉండిపోయారు. ఈ మధ్య ఏ ప్రెస్ మీఠీలోను, ప్రచార కార్యక్రమంలోను కనబడలేదు.

పార్టీ అంతర్గత కార్యకలాపాల్లో పెద్దగా పాల్గొనడం లేదట. అంతేకాదు పార్టీలోని ఇతర సమన్వయకర్తలతో కూడ టచ్ లేరట. దీన్నిబట్టి జగన్ నిర్ణయంతో ఏకీభవించలేక తీవ్ర ఆలోచనలో పడిన రాధ ఏ క్షణానైనా తెగించి పార్టీ మారే ప్రమాదం ఉందని, అదే జరిగితే విజయవాడపై వైసీపీ పట్టు సడలిపోతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి మాత్రం రాధా పార్టీని వీడలేదని అంటూ అతనికన్నా బలమైన నేత కాబట్టే సెంట్రల్ సీట్ మల్లాది విష్ణుకు ఇవ్వడం జరిగిందనే అర్థం వచ్చేట్టు మాట్లాడారు.