రామచంద్రయ్య జనసేన లోకి అందుకే వెళ్లలేదా..?

Saturday, November 10th, 2018, 06:45:42 PM IST

కాంగ్రెస్ మాజీ ఎంపీ, చిరంజీవికి అత్యంత సన్నిహితుడు అయిన సి, రామచంద్రయ్య ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే, అయన జనసేన లో చేరతారని అందరు ఎప్పటినుండో అనుకున్నారు. కానీ ఆయన మాత్రం జగన్ సమక్షంలో వైసీపీ లో చేరబోతున్నారని స్పష్టం చేసారు. దీంతో పవన్ కళ్యాణ్ తో సన్నిహిత సంబంధం ఉన్న ఈయన జనసేనలో ఎందుకు చేరలేదు అన్న ప్రశ్న తలెత్తుతుంది. వాస్తవానికి రామచంద్రయ్య కాంగ్రెస్ కు రాజీనామా చేయకముందే జనసేన నుండి ముఖ్య నాయకులు ఆయనను సంప్రదించినట్టు వార్తలు వినిపించాయి.

రామచంద్రయ్య తో పాటు గంటా శ్రీనివాస్ లాంటి వారు కూడా జనసేన లో చేరతారని వార్తలు వినిపించాయి. అయితే గంటా జనసేనలో చేరేది లేదంటూ క్లారిటీ ఇచ్చారు. రామచంద్రయ్య కూడా కాంగ్రెస్ కు రాజీనామా చేసేముందు చిరంజీవిని సంప్రదించారట, ఆయన జనసేనలో చేరమని ఎటువంటి సూచన ఇవ్వకపోవాటం తోనే రామచంద్రయ్య వైసీపీ లో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. మరో పక్క చిరంజీవి కూడా కాంగ్రెస్ వీడి జనసేనలో చేరతారంటూ వస్తున్నా ఊహాగానాల పై ఆయన ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా కాంగ్రెస్ కు రాజీనామా చేసిన బాలరాజు మాత్రం పవన్ కళ్యాణ్ సమక్షం లో జనసేన పార్టీలో చేరారు, పార్టీలో ఆయనకు తగిన ప్రాధాన్యం ఉంటుందని, ఆయన రాకతో పార్టీ మరింత బలపడనుందని పవన్ కళ్యాణ్ చెప్పారు.

  •  
  •  
  •  
  •  

Comments