ట్రెండీ టాక్‌: టీడీపీపై రెబ‌ల్‌స్టార్ నిప్పులు!

Sunday, February 10th, 2019, 11:00:03 AM IST

ప్ర‌ధాని మోదీ ఏపీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా టీడీపీ చేస్తున్న హంగామాపై రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు నిప్పులు చెరిగారు. పోల‌వ‌రం నిర్మాణానికి కేంద్రం 65 శాతం నిధులు కేటాయించింద‌ని, ఆ నిధుల‌ను ఇప్ప‌టికే ఏపీ ప్ర‌భుత్వానికి అందజేసింద‌ని, ఎవ‌రెన్ని అడండంకులు సృష్టించినా ప్ర‌ధాని మోదీ ఏపీ ప‌ర్య‌ట‌న ఖ‌చ్చితంగా విజ‌య‌వంత‌మ‌వుతుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. పోల‌వ‌రం ప్రాజెక్ట్ ఏపీ ప్ర‌జ‌ల‌కు మోదీ ఇచ్చిన గొప్ప వ‌ర‌మ‌ని స్ప‌ష్టం చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

ప్ర‌ధాని మోదీ విజ‌య‌వాడ ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్ననేప‌థ్యంలో అక్క‌డికి చేరుకున్న కృష్ణంరాజు టీడీపీ నేత‌ల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. విజ‌య‌వాడ స‌భ‌లో ప్ర‌ధాని మోదీ వాస్త‌వాలు చెబుతార‌న్న భ‌యంతోనే టీడీపీ నేత‌లు అడ్డుకుంటున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. ఏపీకి ఏం చేసింది. ఎంత నిధులు కేటాయించింది స్వ‌యంగా ప్ర‌ధాని మోదీ వివ‌రించ‌బోతున్నారు. ఇది గిట్ట‌ని టీడీపీ నేత‌లు ఆయ‌న రాక‌ను అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఎవ‌రెన్ని ప్ర‌య‌త్నాలు చేసినా ప్ర‌ధానిని అడ్డుకోవ‌డం ఎవ‌రి త‌ర‌మూ కాద‌ని స్ప‌ష్టం చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఎప్పుడూ మీడియా ముఖంగా ఏ పార్టీనీ విమ‌ర్శించ‌ని కృష్ణంరాజు టీడీపీ నేత‌ల‌పై విరుచుప‌డటం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంద‌ని ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు, సినీ ప్ర‌ముఖులు చెబుతున్నారు. ఇక ఇంత‌కాలం రాజ‌కీయంగా ఇనాక్టివ్ గా ఉన్న రెబ‌ల్‌స్టార్ ఏపీ ఎన్నిక‌ల వేళ దూకుడు పెంచ‌డం ప్ర‌స్తుతం ప్ర‌భాస్ అభిమానుల్లోనూ చ‌ర్చ‌కొచ్చింది.