రెడ్ మీలకు ఓ దండం.. ప్యాంట్ లో పేలితే పరిస్థితి ఏంటి?

Thursday, June 14th, 2018, 11:43:40 AM IST

పెరుగుతున్న టెక్నాలిజీ చూసి సంతోషపడాలో లేక టెక్నాలిజీ వల్ల పెరుగుతున్న ప్రమాదాలను బయపడాలో అర్థం కావడం లేదని టాక్ ఎక్కువగా వస్తోంది. తక్కువ ధరలకే వస్తున్న మొబైల్ ఫోన్లు ఊహించని విధంగా ప్రమాదాలను కలిగిస్తున్నాయి. విశాఖ విజయవాడ, బెంగళూరు నగరాల్లో ఇటీవల ఫోన్లు పేలిన ఘటనలు నమోదమయ్యాయి. ఇక నేడు తెలంగాణలో ఒక ప్రముఖ స్మార్ట్ ఫోన్ పేలడం అందరిలో ఆందోళన కలిగిస్తోంది. శంషాబాద్ లో చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ రెడ్ మీ ఫోన్ పేలింది.

అసలు వివరాల్లోకి వెళితే.. శంషాబాద్ లో చిట్టిబాబు అనే వ్యక్తి ఇటీవల ‘రెడ్ మీ 4 ఏ’ స్మార్ట్ ఫోన్ ను కొనుక్కున్నాడు. అయితే కూరగాయల దుకాణంలో అతను ఉండగా జేబులో నుంచి పొగలు వచ్చాయి. దీంతో వెంటనే ఆ ఫోన్ ను బయటపడేయడంతో అది ఒక్కసారిగా పేలి పోయింది. వెంటనే సదరు కంపెనీపై చిట్టిబాబు పోలీస్ కంప్లైట్ ఇచ్చాడు. పొరపాటున ప్యాంట్ లో పేలి ఉంటే నా పరిస్థితి ఏమిటని? ఈ రెడ్ మీ ఫోన్లకు ఓ దండమని చెబుతూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

  •  
  •  
  •  
  •  

Comments