ఫ్లాగ్ షిప్ మొబైల్స్ లో “వన్ ప్లస్” కు చెక్ పెట్టిన “రెడ్ మి”

Wednesday, May 29th, 2019, 04:21:50 PM IST

ఇటీవలే మొబైల్ ఫోన్ రంగం దిగ్గజ సంస్థ “వన్ ప్లస్” తమ బ్రాండింగ్ నుంచి “వన్ ప్లస్ 7” మరియు “7 ప్రో” ఫ్లాగ్ షిప్ మొబైల్స్ ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.అయితే ఈ రోజుల్లో మొబైల్ బ్రాండ్స్ వారికి ఎంత పోటీ నడుస్తుందో కూడా అందరికీ తెలుసు.దీనితో ఆ ఫోన్ ను మన దగ్గర లాంచ్ చేసిన రోజునే “చైనా ఆపిల్” సంస్థగా పిలవబడే “రెడ్ మి” వారు వన్ ప్లస్ కు ఛాలెంజ్ చేస్తూ తమ నుంచి కూడా “కిల్లర్ ఫ్లాగ్ షిప్” మొబైల్ వస్తుందని తెలిపారు.అనుకున్నట్టుగానే ఆ ఫోన్ ను చైనా మార్కెట్ లో జూన్ 1 నుంచి విడుదల చేసే ముందుగా ఆ ఫోన్ తాలూకా ఫీచర్లను విడుదల చేశారు.

దీనికి “రెడ్ మి కె 20” గా పేరు పెట్టారు.అయితే వీరు వన్ ప్లస్ తో పూర్తిగా పోటీ పడకపోయినా ఫీచర్లు మాత్రం దాదాపు ఒకేలా తీసుకొని వచ్చారు.మరి అలాంటప్పుడు చెక్ పెట్టినట్టు ఎలా అవుతుంది అనుకుంటే పొరపాటే.క్సియోమి వారు మొదటి నుంచి మధ్య తరగతి ప్రజలను టార్గెట్ చేస్తూ వస్తున్నారు.ఇప్పుడు కూడా అదే విధంగా చేసారు.వన్ ప్లస్ లో హై ఎండ్ మోడల్ 8 జీబీ రామ్ 256 జీబీ అంతర్గత మెమరీ ఉన్న ఫోన్ ధర 53 వేల రూపాయలు ఉండగా “రెడ్ మి కె 20 ప్రో” మాత్రం మన కరెన్సీ ప్రకారం కేవలం 30 వేల రూపాయలు మాత్రమే వస్తుంది.దీన్ని బట్టి వన్ ప్లస్ కు ఈ ఫోన్ గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని టెక్ రంగం విశ్లేషకులు అంటున్నారు.