ఐసీయులో రెడ్‌స్టార్‌ మాదాల రంగారావు

Sunday, May 20th, 2018, 12:11:12 PM IST

సినీనిర్మాత, విప్ల‌వ న‌టుడు, రెడ్‌స్టార్‌ మాదాల రంగారావు గుండెపోటుతో తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. నిన్న‌టి(శ‌నివారం) సాయంత్రం శ్వాస‌కోశ స‌మ‌స్య‌తో హైద‌రాబాద్ స్టార్ హాస్పిట‌ల్‌లో చేరారని ఆయ‌న కుమారుడు, ద‌ర్శ‌క‌న‌టుడు డా.మాదాల ర‌వి తెలిపారు. ప్ర‌స్తుతం ప‌రిస్థితి క్రిటిక‌ల్‌గా ఉంది. ఆయ‌న పూర్తి వెంటిలేట‌ర్ పై.. (ఐ.సి.యు లో) డ‌యాలిసిస్‌లో ఉన్నారు. స్టార్ హాస్పిట‌ల్ సిబ్భంది ఆయ‌న‌ను ర‌క్షించ‌డం కోసం అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇంకో 48 గంట‌ల పాటు ప‌రిస్థితి విష‌మంగా ఉంటుంద‌ని డాక్ల‌ర్లు తెలియ‌జేశారని వెల్ల‌డించారు.

గ‌త ఏడాది గుండెపోటు రావ‌డంతో చెన్న‌య్‌లోని విజ‌య హాస్పిట‌ల్‌లో చికిత్స అందించారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో హైద‌రాబాద్‌లోని స్టార్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించామ‌ని నాటి నుంచి చికిత్స కొన‌సాగుతోంద‌ని ర‌వి తెలిపారు. తొలిపొద్దు, మ‌హాప్ర‌స్థానం, ఎర్ర‌మ‌ల్లెలు, బ‌లిపీఠంపై భార‌త‌నారి, యువ‌త‌రం క‌దిలింది. విప్ల‌వ శంఖం, ఎర్ర‌మ‌ట్టి, నేటి భార‌తం వంటి చిత్రాల్లో మాదాల రంగారావు న‌టించారు.

  •  
  •  
  •  
  •  

Comments