కేసీఆర్ హత్యకు కుట్ర..శశికళ పన్నాగమేనా..?

Sunday, February 12th, 2017, 10:41:59 AM IST


కేసీఆర్ కుటుంబంలో ఆయన మాట జవదాటేవారు లేరు. కేటీఆర్, కవిత, హరీష్ రావు లు టిఆర్ ఎస్ పార్టీ లో కీలకంగా పనిచేస్తున్నారు. వారిమధ్య ఎన్ని విభేదాలు వచ్చినా కేసీఆర్ మాటే వారికి ఫైనల్. కేసీఆర్ ఆదేశాల మేరకే వారు పనిచేస్తారు. ఇది ఇప్పటివరకు కేసీఆర్ కుటుంబంపై ప్రజలకు ఉన్న అభిప్రాయం. కానీ కేసీఆర్ కుటుంబంలోను కలహాలు ఉన్నాయన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. వారిమధ్య ఉన్న కలహాలు కేసీఆర్ పై హత్యాయత్నం జరుగుతోందన్న ఆరోపణల వరకూ వెళ్లింది.

కేసీఆర్ అన్న కుమార్తె రేగులపాటి రమ్య ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ లో అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఈమె కేసీఆర్ పై హత్యాయత్నం జరుగుతోందంటూ సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ మరదలు కుదురుపాక శశికళ నుంచి ఆయనకు ప్రాణహాని ఉందని ఆమె తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆమెకు చెందిన కొందరు వ్యక్తులు మాఫియా గా ఏర్పడి కేసీఆర్ కు ప్రాణహాని తలపెట్టే అవకాశం ఉందని ఆమె అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ లోఉన్న రమ్య ఈ సమయంలో ఈ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది. రమ్యకు, కుదురుపాక శశికళకు మధ్య విభేదాలు ఉన్నాయా అనే అనుమానాల్ని రాజకీయ వర్గాలు వ్యక్తపరుస్తున్నాయి.