కళ్యాణ్ రామ్ 118: అప్పుడు రిలీజ్ చేస్తే వర్కౌట్ అయ్యేనా ..!

Friday, January 11th, 2019, 06:00:18 PM IST

కళ్యాణ్ రామ్ ఎంతగానో ప్రయత్నిస్తున్నప్పటికీ ఇంతవరకు ఒక సరైన హిట్ కూడా పడలేదు. దాంతో ఆయన ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో వున్నాడు. తాను ఆశిస్తోన్న హిట్ ‘118’ సినిమాతో దొరుకుతుందనే నమ్మకంతో ఆయన వున్నాడు. కల్యాణ్ రామ్ హీరోగా దర్శకుడు గుహన్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా టీజర్ కూడా విడుదలైంది, సస్పెన్స్ ఎలిమెంట్ తో ఉన్న ఆ టీజర్ సినిమాపై అందరిలో అంచనాలను పెంచేసింది.

118 సినిమాకు సంబంధించి చాలావరకూ షూటింగ్ పూర్తిచేసుకుంది. నివేదా థామస్, షాలినీ పాండే హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాలో, కల్యాణ్ రామ్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. మహేశ్ కోనేరు నిర్మిస్తోన్న ఈ సినిమాను మార్చి 1వ తేదీన విడుదల చేయనున్నారు. మార్చ్ అంటే ఎగ్జామ్స్ సీజన్ అసలే హిట్ తప్పనిసరి అయిన పరిస్థుతుల్లో అందులోను రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ లా ఉన్న ఈ సినిమా ను ఎగ్జామ్స్ సీజన్ లో రిలీజ్ చేస్తే వర్కౌట్ అవుతుందా అన్న సందేహం వ్యక్తమవుతోంది. కళ్యాణ్ రామ్ తాజాగా “ఎన్టీఆర్” బయోపిక్ లో తన తండ్రి హరికృష్ణ పాత్ర పోషించగా, కళ్యాణ్ రామ్ ఆ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడని ప్రశంసలు అందుతున్నాయి. మరి, కల్యాణ్ రామ్ ఆశిస్తున్నట్టుగా ఈ సినిమా అయినా ఆయనకి హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి మరి. .