ఎన్టీఆర్ మహానాయకుడు: రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్టేనా..?

Monday, February 11th, 2019, 11:33:46 AM IST

ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ డేట్ గురించి అనుమానాలు నెలకొన్న సంగతి తెలిసిందే, ముందుగా ఫిబ్రవరి 7న ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, ఎన్టీఆర్ కథానాయకుడు ఇచ్చిన షాక్ తో బాలకృష్ణ సహా సినిమా యూనిట్ అంతా అయోమయంలో పడ్డారు.ఒకానొక దశలో సినిమా ఆగిపోయిందని, ఇక రిలీజ్ అవ్వదన్న పుకార్లు కూడా షికారు చేసాయి. అయితే “కథానాయకుడు” ఎఫెక్ట్ తో షాక్ తిన్న బాలకృష్ణ, క్రిష్ లు సినిమా రీషూట్ మొదలు పెట్టారు అందుకే రిలీజ్ పోస్ట్ ఫోన్ చేసారు.

సినిమా విడుదల విషయంలో వస్తున్న పుకార్లను పట్టించుకోకుండా క్రిష్ చకా చకా షూటింగ్ కానిచ్చేశారు, శనివారం నాటికి గుమ్మడికాయ కొట్టేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభించారు. మర్చి 1న విడుదల కానుంది అని ఇటీవల వార్తలొచ్చాయి, అయితే ఈ నెల 22న మహానాయకుడు విడుదల కానుందని విద్యాబాలన్ చేత అనౌన్స్ చేయించింది సినిమా యూనిట్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని అనుకున్న సమయానికి కచ్చితంగా విడుదలవుతుందని సినిమా యూనిట్ అంటోంది. మరి, అనుకున్న సమయానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొని 22న మహానాయకుడు రిలీజ్ అవుతుందో లేదో చూడాలి.