డేట్ కలిసొస్తే సాయిధరమ్ తేజ్ కు హిట్ ఖాయం..!

Friday, March 15th, 2019, 10:42:20 AM IST

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా, కళ్యాణి ప్రియదర్శన్, నివేథా పేతురాజ్, హీరోయిన్లుగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా చిత్రలహరి. ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదలై అందరిని ఆకట్టుకుంటోంది, వరుస ఫ్లాపులతో ఢీలా పడ్డ సాయిధరమ్ తేజ్ కెరీర్ ఈ సినిమాతో పుంజుకుంటుందన్న నమ్మకం కలుగుతుంది. కమెడియన్ గా సునీల్ కు కూడా కంబ్యాక్ మూవీ అయ్యేలా ఉంది టీజర్ చూస్తుంటే, మరో పక్క రిలీజ్ డేట్ విషయంలో కూడా ఈ సినిమాకు కలిసొచ్చేలా ఉంది. చిత్రలహరి ఏప్రిల్ 12న విడుదలౌతున్న సంగతి తెలిసిందే, ఎలక్షన్లు అయిపోయిన మరుసటి రోజే విడుదలవడం ఈ సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది.

మొదట్లో ఏప్రిల్ 30న ఎలక్షన్లు రానున్నాయని ఊహాగానాలు వచ్చాయి, అందరూ ఆ డేట్ కన్ఫార్మ్ అనుకోని సినిమా రిలీజ్ ను వాయిదా వేసుకున్నారు. ఏప్రిల్ 25న రిలీజ్ అవ్వాల్సిన మహర్షి ఎన్నికల ప్రచారం పీక్స్ లో ఉంటుందని భావించి, మే నెలకు పోస్ట్ పోన్ చేసారు, మజిలీ కూడా ఏప్రిల్ 30ని దృష్టిలో ఉంచుకొని ముందుగా ఏప్రిల్ 5కి ఫిక్స్ చేసారు. దీంతో ఎన్నికల ప్రచారం ఎఫెక్ట్ మజిలీపై పడనుంది, ఇక ఎన్నికలు అయిపోయి జనాలంతా ఖాళీగా ఉంటారు కాబట్టి ఏప్రిల్ 11న విడుదలవటం చిత్రలహరి సినిమాకు ప్లస్ అవ్వనుంది. కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఆ గ్యాప్ లో పెద్ద సినిమాలేవీ లేవు కాబట్టి చిత్రలహరితో తేజ్ కు హిట్ కన్ఫార్మ్ అవుతుంది.