బ్రేకింగ్ న్యూస్ : కనీవినీ ఎరుగని ఆఫర్ ప్రవేశపెట్టిన ‘జియో’

Tuesday, June 12th, 2018, 07:01:26 PM IST

రిలయన్స్ జియో రాకతో భారత టెలికాం రంగంలో ఒక నూతనాధ్యాయానికి శ్రీకారం చుట్టింది అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. నిజనికి జియో రంగప్రవేశంతోనే ఇండియాలో ఇంటర్నెట్, కాల్, ఎస్ఎమ్ఎస్ ల ధరలు సామాన్యుడికి కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇకపోతే నేటి డిజిటల్ యుగంలో ప్రతిఒక్కరికి స్మార్ట్ ఫోన్ వాడకం ఆవశ్యకం కావడంతో, దానిలో ఇంటర్నెట్ వినియోగం అత్యంత ఆవశ్యకంగా మారింది. జియో ప్రవేశంతో ఇంటర్నెట్ ధరలు కూడా పూర్తిగా తగ్గడం, తత్ఫలితంగా ఇతర టెలికాం కంపెనీలు కూడా ఆ పోటీకి కిందకి దిగి రాక తప్పలేదు. అయితే గత కొద్దిరోజులుగా జియో కి గట్టి పోటీ ఇస్తోంది మాత్రం ఎయిర్ టెల్ అని చెప్పక తప్పదు.

అయితే రెండు రోజుల క్రితం ఎయిర్ టెల్ ఎవరు ఊహించని విధంగా ఇప్పటివరకు జియో రూ.149 ప్లాన్ లో రోజుకు 1.5 జిబి కన్నా ఎక్కువగా, అంటే రోజుకి 2జిబి ఇస్తున్నట్లు ఎయిర్ టెల్ ప్రకటించి జియోకి షాకించింది. ఇదిజరిగి రెండు రోజులు గడవక ముందే నేడు జియో అసలు ఇండియాలోనే ఏ టెలికాం ఆపరేటర్ ప్రవేశపెట్టని, పెట్టలేని ఒక అద్భుత ఆఫర్ ని తీసుకొంచింది. అదేమిటంటే 149, 349, 399, 449 ప్లాన్లపై ప్రస్తుతం రోజుకు 1.5 జిబి డేటా లభిస్తున్న విషయం తెలిసిందే. అందుకు అదనంగా అంటే రోజుకు ప్రతిఒక్క యూజర్ కు మరొక 1.5 జిబి ఇవ్వనుంది. అంటే వారికి రోజుకు 3జిబి అన్నమాట. అయితే ఈ ఆఫర్ 198, 398, 498, 299, 509, 799 ప్లాన్లపై కూడా వర్తిస్తుంది. అంటే అన్ని ప్లాన్లకు ఈ అదనపు రోజుకు 1.5జిబి అఫర్ వర్తించనుంది. కాకపోతే ఈ ఆఫర్ ను పొందాలంటే యూజర్లు జూన్ 12 నుండి జూన్ 30 లోపు తమ నంబర్లను రీచార్జి చేసుకోవలసి ఉంటుంది అన్నమాట……